తాజాగా తమిళంలో రిలీజ్ అయిన మాస్ యాక్షన్ డ్రామా ‘మదరాసి’కి మంచి హైప్ వచ్చింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. రిలీజ్‌కి ముందు నుంచే ఈ సినిమా మీద అంచనాలు ఉండటంతో మొదటి రోజునే మంచి ఓపెనింగ్స్ సాధించింది.
తమిళ ప్రేక్షకులు సినిమాకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బాగా వచ్చాయి. మేకర్స్ చెప్పిన ప్రకారం కేవలం 13 రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ దాటేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి వేరుగా కనిపించింది. ఇక్కడ మిక్స్‌డ్ టాక్ రావడంతో ఎక్కువ రోజులు థియేటర్లలో నిలవలేకపోయింది.
విద్యుత్ జామ్వాల్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు. బిజు మెనన్, విక్రాంత్, షబీర్ కల్లారక్కల్ వంటి నటులు కూడా కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. సంగీతాన్ని అనిరుధ్ అందించగా, యాక్షన్ సన్నివేశాలు, హీరో–విలన్ మధ్య ఘర్షణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
