ఆ నిర్మాతలతో గొడవపడ్డ సీతారామం బ్యూటీ..!

Sunday, December 22, 2024

అటు బాలీవుడ్‌ లోనూ..ఇటు టాలీవుడ్‌ లోనూ హీరోయిన్‌ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న మృణాల్‌ తాజాగా షేర్‌ చేసిన ఓ విషయం ప్రస్తుతం అందర్ని షాక్ కి గురి చేస్తుంది. ఓ సినిమాలో ప్రధాన పాత్ర పొందడానికి నిర్మాతలతో గొడవ పడాల్సి వచ్చిందని ఆమె తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది. ‘పూజా మేరీ జాన్’ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఆ పాత్ర తనకే దక్కాలని ఎంతో కోరుకున్నానని మృణాల్ తెలిపింది.

ఆడిషన్లు, స్క్రీన్ టెస్ట్స్ చేసిన తర్వాత కూడా ఆ పాత్ర మరో నటికి ఇవ్వబోతున్నారని తెలిసి నిర్మాతలతో గొడవ పెట్టుకున్నట్లు వివరించింది. ” నేను ప్రధాన పాత్రలో నటించిన చిత్రాల్లో ‘పూజా మేరీ జాన్‌’ కూడా ఒకటి. రెండేళ్ల క్రితమే ఈ సినిమాని చిత్రీకరించాం. బహుశా ఈ ఏడాది థియేటర్లలోకి రావొచ్చు. ‘సీతారామం’ షూట్‌ పూర్తైన వెంటనే ఈ సినిమా స్క్రీన్‌ టెస్ట్‌ కోసం వచ్చేశాను. ఇందులో పాత్ర నచ్చింది. ఇలాంటి రోల్‌లో ఎప్పటి నుంచో యాక్ట్‌ చేయాలనుకుంటున్నా.

నా నిజ జీవితానికి ఈ కథతో ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఈ కథ కోసం మరొక నటిని ఎంచుకుంటున్నారని తెలిసి.. నిర్మాతలతో గొడవ పడ్డా. ఈ రోల్‌ నేను చేస్తానని చెప్పా. ఎన్నో ఆడిషన్స్‌ ఇచ్చా. స్క్రీన్‌ టెస్టుల్లో పాల్గొన్నా.ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాతలను ప్రాధేయపడి ఇందులో నటించా” అని తెలిపింది. కాగా రీసెంట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles