అక్కో..నీకు అయ్యింది నిశ్చితార్థమే.. పెళ్లి కాదు!

Sunday, December 22, 2024

తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సౌత్‌ వారికి పరిచయం అక్కర్లేని పేరు వలక్ష్మీ శరత్ కుమార్‌. తెలుగు ప్రేక్షకులకు విలన్‌ గా బాగా పరిచయమున్న వరలక్ష్మీ ఇటీవలే తన ప్రియుడితో ఎంగేజ్‌ మెంట్‌ చేసుకుంది.  నటుడు  విశాల్‌కు బ్రేకప్ చెప్పేసి ఒంటరిగానే ఉండిపోతుంది అనుకుని బాధపడిన అభిమానుల  ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 పెళ్లి బాజాలు త్వరలోనే మోగనున్నాయని  తెలుస్తుండగా.. ఆ లోపే కాబోయే వాడితో  కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతంవీరు  బ్యాంకాక్ లో గడుపుతున్నారు. అందుకు గానూ వీరిద్దరు తమకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

షాపింగ్, వర్క్ అవుట్, లంచ్, డిన్నర్.. ఇలా అన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. వీటిని చూసిన అభిమానులు హ్యాపీ ఫర్ యూ అని  అంటుంటే.. కొందరు మాత్రం అప్పుడే ఇలా తిరగడం ఎందుకంటూ తిట్టిపోస్తున్నారు. మీకు అయింది నిశ్చితార్థం మాత్రమే పెళ్లి కాదు.. అప్పుడే హనీమూన్ ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles