బురద లక్ష్యాలు.. జగన్ బుర్రలేని ప్రశ్నలు!

Friday, December 5, 2025

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన బంగారుపాళెం మామిడి రైతుల పర్యటనకు అనూహ్య స్పందన వచ్చినట్టుగా.. ఆ రకంగా తాను మామిడి రైతుల కష్టాలన్నీ తీర్చేసినట్టుగా, తనతో కష్టాలు చెప్పుకోవడానికి మామిడి రైతులందరూ పదేపదే ఎగబడినట్టుగా.. బిల్డప్పులు చాటుకునే పనిలో పడ్డారు. నిజానికి బంగారుపాళెం మార్కెట్ యార్డుకు జగన్ చేరుకునే సమయానికి అక్కడ రైతులు ఎవ్వరూ లేరనేది అందరికీ తెలిసిన సంగతి. అయినా అక్కడ  మీడియాతో మాట్లాడేసి.. ఆయాత్ర పేరుమీద తాను చేయదలచుకున్న రాద్ధాంతం రచ్చ మొత్తం పూర్తయిపోయింది గనుక.. తిరిగివెళ్లిపోయారు జగన్మోహన్ రడ్డి.

ఇప్పుడు రోజులు గడిచాక, తన యాత్ర సాగించిన సత్ఫలితాల గురించి టముకు వేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. తమకు జరుగుతున్న అన్యాయం గురించి రోడ్డెక్కే వారంతా అసాంఘిక శక్తులేనా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. మామిడికాయలను కొనే దిక్కులేక రైతులు కోసిన దిగుబడిని ఎక్కడికక్కడ పారబోస్తున్నారు. వారంతా మీ కంటికి రౌడీలు దొంగలు అసాంఘిక శక్తుల్లా కనిపిస్తున్నారా? అంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. ఆయన యాత్ర నాడు.. రోడ్ల మీద కాన్వాయ్ ముందు మామిడికాయలను ట్రాక్టర్ల వారు దొర్లించి పోసిన మాట నిజం. కానీ జగన్ తెలుసుకోవాల్సిన వాస్తవం ఒకటుంది. పోలీసులు ఆరోజు మామిడికాయలను ఒక రైతు పొలంనుంచి కొని, ట్రాక్టర్లలో లోడ్ చేయించి.. జగన్ కాన్వాయ్ ఎదుట పోయించడం ద్వారా.. హైప్ క్రియేట్ చేయాలని అనుకున్నారు. కానీ.. పోలీసులు డ్రోన్ కమెరాలతో పెట్టిన నిరంతర నిఘా అసలుపాపాన్ని పట్టి ఇచ్చింది. దేవేంద్ర అనే న్యాయవాది, వైసీపీ కార్యకర్త, పొరుగు గ్రామంలోని మామిడి తోట నుంచి ట్రాక్టర్లను లోడ్ చేయించి పంపి, తాను ఆదేశించినప్పుడు రోడ్ల మీద పోయాల్సిందిగా ఏర్పాటు చేసినట్టు వార్తలొచ్చాయి. అలాంటి కుట్రలు చేసేవారి మీద కేసులు నమోదు అయ్యాయి.

అంతే తప్ప.. అదివరలో కూడా కొందరు రైతులు పారబోసి వెళ్లడం జరిగింది. అలాగే.. టమోటా రైతులు దాదాపుగా ప్రతి ఏడాదీ ఏదో ఒక సమయంలో ధరపలకని సీజన్లో ట్రాక్టర్లను దిబ్బల్లో పోయించేసి తిరిగి వెళ్లిపోతుంటారు. కానీ.. వారెవ్వరి మీద కూడా పోలీసులు ఎన్నడూ కేసులుపెట్టలేదు. కాకపోతే.. మామిడికాయలను రోడ్డు మీద పోసేయడం కూడా ఒక రాజకీయ కార్యక్రమంగా, ఉద్దేశపూర్వంగా రాజకీయ లబ్ధి కోసం జరిగిన కుట్ర కావడం వల్ల మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.
అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి జరిపిన బంగారుపాళెం యాత్రను ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల మొసలి కన్నీరుగా అభివర్ణిస్తున్నారు.

ఇదొక తమాషా అయితే ట్విటర్లో జగన్ సంధిస్తున్న ప్రశ్నలు ఇంకా కామెడీగా ఉన్నాయి. తన పర్యటన ఖరారయ్యాకే వ్యవసాయ మంత్రి ఢిల్లీ వెళ్లినట్టుగా ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు. ఏటా మే నెలలో పల్ప్ ఫ్యాక్టరీలు తెరుస్తారని ఈసారి ఆలస్యంగా, కొన్నింటినే ఎందుకు తెరిచారని జగన్ అడుగుతున్నారు. ఈ ప్రశ్న అడగాల్సింది ఫ్యాక్టరీ యజమానుల్ని కాదా. ప్రభుత్వం ఎలా సమాధానం చెబుతుందనేది ప్రజల డౌటు. అలాగే సరుకంతా ఒకేసారి మార్కెట్ వచ్చేలా చేశారని కూడా అంటున్నారు. అయినా ఈ ప్రశ్న అడగాల్సింది రైతుల్ని కదా. సాధారణంగా కటింగ్ ఆర్డర్లు తెచ్చుకున్నాకే మామిడిని తీసుకువస్తే ఎవ్వరికీ నష్టం ఉండదు. ప్రభుత్వానికి సంబంధం లేని అంశాల్లో కూడా ప్రశ్నలు వేయడం ద్వారా జగన్ తన అవగాహనలేమి బయటపెట్టుకుంటున్నారని జనం అంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles