జగన్మోహన్ రెడ్డి హయాంలో నెంబర్ టు తానేనని చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు గడ్డు రోజులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఎన్నిక చల్లదంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది. నామినేషన్ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆస్తుల వివరాలు తప్పుగా పేర్కొన్నారనేది పిటిషన్‌లోని ఆరోపణ. తన భార్య పేరుతో ఉన్న 142 స్థిరాస్తులను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని ఈ పిటిషన్ లో వివరించారు. అంత ఘంటా భజాయించి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో- అంత మొత్తంలో కాకపోయినప్పటికీ అఫిడవిట్లో ఏ చిన్న అబద్ధాలు చెప్పినట్లుగా తేలినాసరే, ఆస్తులు వివరాలను దాచినట్లుగా తేలినా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనర్హత రేటు పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బోడె రామచంద్ర యాదవ్ పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న ప్రధాన ప్రత్యర్థుల్లో ఒక!రు రామచంద్ర యాదవ్ ప్రజాదరణను చూసి ఆయన చిన్న ప్రజాందోళన చేయాలని నిర్ణయించుకున్నా సరే విపరీతమైన పోలీసు బలగాలతో అణిచేస్తూ, హౌస్ అరెస్టులు చేయిస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఐదేళ్ల కాలంలో కర్కశంగా వ్యవహరించారు. గత ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో ఉన్న రామచంద్ర యాదవ్, పెద్దిరెడ్డి వేధింపులను తట్టుకోలేక తానే సొంతంగా బిసివైపి పార్టీని ప్రారంభించారు. ఆయనే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఈ పిటిషన్ వేయడం గమనార్హం.
ఈ పిటిషన్ను బుధవారం విచారించిన హైకోర్టు పెద్దిరెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు పొందిన తెదేపాతరపు కూటమి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి పేరును వ్యాజ్యంలో ప్రతివాదుల జాబితాలో చేర్చాలని పిటీషనర్ కు సూచించింది. మరొకవైపు 142 స్థిరాస్తులు వివరాలు పేర్కొనలేదని చెబుతున్నందున ఆ ఆస్తుల వివరాలతో మరొక అఫిడవిట్ వేయాలని కూడా పిటీషనర్ కు న్యాయ పీఠం సూచించింది. ప్రస్తుతానికి పిటిషన్ ఈనెల 31 వ తారీకుకు వాయిదా పడింది. అయితే పెద్దిరెడ్డి ఆస్తుల వివరాలు దాచారనే సంగతి తేలితే గనుక, ఆయన మీద అనర్హత వేటు పడుతుంది. ఆ తర్వాతి స్థానంలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిని గెలిచినట్టుగా ప్రకటించే అవకాశం కూడా ఏర్పడుతుంది. పాపం 11 కాస్తా వైసీపీ బలం 10 అవుతుంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాను పరిగణనలోకి తీసుకుంటే పెద్దిరెడ్డి కుటుంబం తప్ప వైయస్సార్ కాంగ్రెస్ తరపున ఎవ్వరూ గెలవలేదు. అలాంటిది తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అడుగుపెడితే చాలు, మీరు దొంగ ఓట్లుతో గెలిచారు, మా ఊరికి రావద్దు అంటూ ప్రజలు తిప్పి కొడుతున్నారు. మిథున్ రెడ్డి పరిస్థితి కూడా ఇంచుమించుగా అదే విధంగా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ప్రజల వ్యతిరేకతకు గురయ్యేలాగా లేదు కానీ, అసలు ఆయన ఎన్నిక చెల్లుతుందా? లేదా, అనర్హుడిగా మిగిలిపోతారా? అనేది సందేహంగానే ఉంది!
పెద్దిరెడ్డి కి అనర్హత వేటు తప్పదా?
Thursday, November 21, 2024