లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి ఇరుక్కుని.. జైలు పాలైతేనే.. కనీసం ములాఖత్ రూపంలో వెళ్లి పరామర్శించడానికి కూడా వైఎస్ జగన్ ధైర్యం చేయడం లేదు. రేపు ఇసుక కుంభకోణం విషయంలో కూడా ప్రభుత్వం అన్ని ఆనుపానులు రాబట్టి.. కేసులు నమోదు చేసి.. ఏకంగా ఆ దందాలకు కేంద్రబిందువు అయిన అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జైల్లో వేస్తే కూడా జగన్ పట్టించుకునేది ఇలాగే ఉంటుందా? అని ఆ వర్గం కార్యకర్తలు షాక్ తింటున్నారు. మిథున్ రెడ్డి ములాఖత్ కు జగన్ టైం తీసుకుని కూడా పర్యటన రద్దు చేసుకోవడం అనేది వారికి చాలా అవమానకరంగా ఉంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అత్యంత విశ్వసనీయుడైన అనుచరుడు. పార్టీలో అప్పట్లో ఏదో నెంబర్ టూ గేమ్ నడుస్తున్నట్టుగా సజ్జల రామక్రిష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి ఆ రేసులో పరస్పరం కొట్టుకుంటున్నట్టుగా రకరకాల పుకార్లు వినిపిస్తూ ఉండేవి గానీ.. నిజానికి చాపకింద నీరులా బయటకు కనిపించని కత్తిలాగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. జగన్ తర్వాత అంతటి కీలక వ్యక్తిగా పెత్తనం చెలాయిస్తూ వచ్చాడనేది అంతర్గత వ్యవహారాల గురించి పట్టు ఉన్న వారికి తెలుసు.
అంతటి కీలకవ్యక్తి గనుకనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. లిక్కర్ కుంభకోణానికి కూడా ప్రధాన సూత్రధారుల్లో ఒకరుగా చెలరేగిపోయారు. తొలిదశలో విజయసాయిరెడ్డి నివాసాలలో జరిగిన వ్యూహరచన, పాలసీరచన సమావేశాల దగ్గరినుంచి ప్రతిదశలోనూ ఆయన గైడెన్స్ లోనే మొత్తం లిక్కర్ కుంభకోణం నడిచింది. తమ నాయకుడు.. అంత వ్యవహారం నడిపించినందుకు కేవలం నెలకు 5 కోట్లుమాత్రమే తీసుకున్నాడని.. మిగిలిన వందల కోట్ల రూపాయలను జగన్ కాజేశారు కదా అనేది పెద్దిరెడ్డి వర్గం కార్యకర్తల బాధ. అంత విశ్వాసంగా పనిచేసినా కూడా.. కనీసం ములాఖత్ కు వెళ్లకుండా జగన్ రద్దు చేసుకోవడం వారికి అవమానంగా ఉంది.
ఈ సమయంలో వారు ఇసుక కుంభకోణం గురించి భయపడుతున్నారు. ఇటీవలే ఇసుక కుంభకోణానికి సంబంధించి కూడా నివేదికలు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. దాని మీద కూడా సిట్ నియమించి.. పోలీసు దర్యాప్తు ప్రారంభం అయితే గనుక.. మొదటి నిందితుడిగా బహుశా తమ పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని ఆ వర్గం భయపడుతున్నారు. ఎంతో దగ్గరి అనుచరుడైన మిథున్ రెడ్డిని పరామర్శించడానికే భయపడుతున్న జగన్.. రేపు రామచంద్రారెడ్డి అరెస్టు అయి రిమాండుకు వెళితే మాత్రం పట్టించుకుంటారా? అనే అనుమానం వారిలో కలుగుతోంది. విశ్వాసంగం ఉంటూ జగన్ తలపెట్టిన దందాలు అన్నింటికీ సహకరించినందుకు ఇప్పుడు ఈ అవమానం చాలా బాధాకరంగా ఉన్నదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
పెద్దిరెడ్డి వర్గంలో షాక్.. ఇసుక స్కాం బయటికొస్తే ఎలా?
Thursday, December 4, 2025
