బాలయ్య నెక్ట్స్‌ రెండు సినిమాల్లో కూడా ఆమెనే!

Friday, December 27, 2024

నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబోలో వస్తున్న భారీ చిత్రం గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ గ్లామరస్ నటి ఊర్వశి రౌతేలా అలాగే బాబీ డియోల్ లు ఈ చిత్రంలో నటిస్తుండగా అసలు ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు.

అయితే కొన్ని నెలలు క్రితమే యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఉన్నట్టుగా ఓ టాక్‌ కూడా వినిపిస్తుంది. ఇది అధికారంగా కన్ఫర్మ్ కాలేదు కానీ ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు బాలయ్య 109 లోనే కాకుండా నెక్స్ట్ 110 వ సినిమాలో కూడా ఉన్నట్టుగా సమాచారం. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

బాలయ్య 110 ఇప్పటి వరకు తాను చేయని దర్శకుడితో ఉంటుందో లేక బోయపాటి శ్రీనుతో ఉంటుందో అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఎలాగో అఖండ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా కనిపించింది కాబట్టి ఒకవేళ బాలయ్య 110 అఖండ 2 అయితే ప్రగ్యా జైస్వాల్ కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles