యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌తో రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత శర్వానంద్ మరో యూత్‌ఫుల్ సినిమాలో యాక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడంట అయితే, ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నారని టాక్.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ, డైరెక్షన్ వహించిన మూవీ ‘జానీ’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైన, బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఈ టైటిల్‌ను శర్వానంద్ తన తరువాత సినిమా కోసం వాడనున్నాడట. దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించనున్న సినిమాలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నాడు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాకు జానీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.