జగన్ దళాల్ని  ఓ రేంజిలో ఆడుకున్న షర్మిల!

Tuesday, December 9, 2025

సొంత చెల్లెలితో జగన్మోహన్ రెడ్డికి విభేదాలున్నాయి. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆమె కాంగ్రెస్ పార్టీకి సారథులుగా ఉన్నారు. వారి మధ్య విభేదాలు భావజాలానికి సంబంధించినవి కాదు. ఆస్తుల తగాదాలు మాత్రమే. కూటికి గతిలేని వారు, ఉండే అంతో ఇంతో ఆస్తుల మీద ఆధారపడితే మాత్రమే పొట్గగడిచే స్థితిలో ఉన్నవారు.. ఆస్తులకోసం కాట్లాడుకుంటే ఓకే. కానీ.. వేల లక్షల కోట్ల సంపదలతో తులతూగేవాళ్లు కూడా పంపకాల్లో తగాదా పడడం ఆశ్చర్యకరం. ఏదైతేనేం అన్నాచెల్లెళ్ల మధ్య తగవులున్నాయి. అలాగని.. చెల్లెలి మీద బురద చల్లించడానికి జగన్ తన దళాలతో ప్రయత్నించడం అనేది ఎలా కరెక్టు అవుతుంది. ఆమె రాజకీయ విమర్శలు చేస్తే.. వాటికి దీటుగా జవాబు చెప్పాలే తప్ప.. ప్రతివిమర్శల్లో దిగజారుడుతనం మంచిదేనా? ఆమె పరువు తీసేలా తన తొత్తులతో మాట్లాడిస్తే ఆయన పరువు కూడా పోయినట్లు కాదా? అనేది ప్రజల్లో సందేహం.

మొత్తానికి షర్మిలను చంద్రబాబు సేవలో తరిస్తున్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరచుగా అసహ్యకరమైన విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే.. ఇలాంటి అన్ని కుటిల విమర్శలకు కలిపి షర్మిల ఒకేసారిగా స్ట్రాంగు కౌంటరు ఇచ్చారు. వారి నోర్లు మూయించడానికి నిప్పుల వాన కురిపించారు. తన మీద విమర్శలు చేస్తున్న వారిని, వారితో అలా మాట్లాడిస్తున్న జగన్ ని అందరినీ కలిపి కడిగిపారేశారు.

వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పినా కూడా ఆ పార్టీ నాయకుల నీచపు చేష్టలు మారడం లేదంటూ షర్మిల విరుచుకుపడ్డారు. ఇప్పటికీ అద్దంలో చూసుకుంటే వారికి చంద్రబాబు ప్రతిబింబం కనిపిస్తోందని..  వారు ఈ జన్మకు మారరని అర్థమవుతోందని ఆమె అన్నారు. స్వయంశక్తితో ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీ, ప్రజల్లో ప్రత్యామ్నాయంగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉండడం చూసి ఓర్వలేక నిందలేస్తున్నారని ఆరోపించారు.

ప్రజలు ఓట్లేసి గెలిపించినా అసెంబ్లీకి వెళ్లడానికి మీకు దమ్ముల్లేవు.. కానీ ప్రజా సమస్యలపై గొంతెత్తి పోరాడుతున్నది కాంగ్రెస్ పార్టీ.. పాపపు సొమ్ము ఎరవేసి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలని కుట్రలు పన్నుతున్నారు మీరు.. అంటూ షర్బిల తీవ్రస్థాయిలో ఎటాక్ చేశారు. మరోవైపు స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతింటూ రాష్ట్ర ప్రయోజనాల్ని మోడీ పాదాల దగ్గర తాకట్టు పెట్టారంటూ ఆమె జగన్ మీద విమర్శలు చేశారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారని, రుషికొండను కూడా కబ్జా చేయాలని చూశారని నిందించారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles