గేమ్‌ చేంజర్‌ పై కీలక అప్డేట్‌ ఇచ్చిన శంకర్‌!

Sunday, June 30, 2024

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ హీరోగా , కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌. గత రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు విడుదల తేదీ పై ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా నుంచి ఒక్క సాంగ్ తప్పితే మరో అప్డేట్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

ఇలాంటి సమయంలో డైరెక్టర్ శంకర్ స్వయంగా ‘గేమ్ చేంజర్’ పై అప్డేట్ ఇచ్చాడు. ‘ఇండియన్‌ 2’ ప్రమోషన్స్‌ లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో డైరెక్టర్ శంకర్ ‘గేమ్ ఛేంజర్‌’ గురించి కొన్ని కీలక అప్డేట్లు ఇచ్చారు. ” సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఇంకా 10 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ‘ఇండియన్‌ 2’ విడుదల కాగానే ‘గేమ్ ఛేంజర్‌’ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేస్తాను.

ఆ తర్వాత ఫైనల్‌ ఫుటేజ్‌ చూసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభిస్తానని శంకర్‌ వివరించారు. అన్ని పనులు పూర్తయిన తర్వాత విడుదల పై ఓ నిర్ణయం తీసుకుంటా. సాధ్యమైనంతవరకు త్వరగానే విడుదల చేయడానికి ప్రయత్నిస్తా” అంటూ శంకర్‌ చెప్పుకొచ్చాడు. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా కథానాయికగా నటించగా.. నటి అంజలి మరో కీలక పాత్ర లో కనిపించబోతుంది. బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్‌ వంటి వారు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles