షాకింగ్ రన్ టైం లాక్ చేసిన శేఖర్ కమ్ముల!

Friday, December 5, 2025

టాలెంటెడ్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘కుబేర’ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపుతుంది. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా, కింగ్ నాగార్జున ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. శేఖర్ కమ్ముల సినిమా అంటేనే కథలో నెమ్మదిగా జరిగే భావోద్వేగాల ప్రయాణం గుర్తుకు వస్తుంది. అయితే ఈసారి మాత్రం భారీ బడ్జెట్‌తో, స్టార్స్ కలయికలో, డిఫరెంట్ యాప్రోచ్‌తో ‘కుబేర’ రూపొందుతుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఫైనల్ స్టేజ్ వర్క్ కూడా పూర్తయ్యే దశలో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అందిన సమాచారం ప్రకారం ‘కుబేర’ రన్ టైమ్ ఏకంగా 3 గంటల 15 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా శేఖర్ కమ్ముల previous సినిమాలు కూడా సిగ్నిఫికెంట్ లెంగ్త్ ఉండేలా ఉంటాయి కానీ ఈసారి అది మరింత ఎక్కువగా ఉంది.

ఇప్పుడు ఈ పొడవైన రన్ టైమ్‌నే ఈ సినిమాకి ఓ ప్రధాన పరీక్షగా చూడాలి. ఎందుకంటే కథ ఎంత ఇంట్రెస్టింగ్‌గా సాగినా, ప్రేక్షకుల దృష్టిని అంత సేపు కట్టిపడేయాలంటే బలమైన కథనం, ఎమోషన్స్, స్క్రీన్ ప్లే అవసరం. చిన్న చిన్న బోర్ సీన్లు కూడా పూర్తి ఫీలును దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది. ఇక మేకర్స్ ఈ అంశాన్ని ముందుగానే గ్రహించి స్క్రిప్ట్‌లో ఎలాంటి డ్రాగ్ లేకుండా కట్ చేసారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఈ సినిమా ఎలాంటి అనుభూతిని అందిస్తుందో, ప్రేక్షకులు ఈ లెంగ్త్‌తో కూడా కనెక్ట్ అవుతారా అనేది తెలియాలంటే జూన్ 20న థియేటర్స్‌లో చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles