సమంత ఆన్‌ డ్యూటీ!

Andhrawatch
1 Min Read

టాలీవుడ్‌ బ్యూటీ సమంత తదుపరి ఇండియన్‌ వెర్షన్‌ సిటాడెల్‌ లో కనిపించునున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సిరీస్‌లో, ఆమె బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి నటించింది. అయితే చాలా కాలం నుంచి కూడా సమంత ఏ భాషలోనూ సినిమాలు చేసేందుకు ఒప్పుకోలేదు.

కానీ ఆమె బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌తో జతకట్టింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో కు సంబంధించిన కొత్త ప్రకటనలో వారు కలిసి కనిపించారు. భారత క్రికెటర్ పుజారా కూడా వారితో కలిశారు. దీనికి సంబంధించిన ప్రోమోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. సమంత తిరిగి వర్క్ లోకి రావడం పట్ల ఆమె అభిమానులు సంతోషిస్తున్నప్పటికీ, చాలా మంది ఆమె మళ్లీ వెండి తెరపైకి రావాలని కోరుకుంటున్నారు. 

Share This Article