తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద 2021లో జరిగిన దాడి కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వమాజీ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి తన మీద నమోదవుతున్న పోలీసు కేసుల విషయంలో భయపడుతున్నారా? విచారణకు హాజరు కావాలంటేనే జంకుతున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. గురువారం ఉదయం పదిన్నర గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు ఆయనకు నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో, పోలీసుల సమక్షానికి వెళితేగనుక తనను అరెస్టు చేసేస్తారేమో అని ఆయన ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తోంది.
జగన్ రెడ్డి పాలన హయాంలో పోలీసు శాఖకు తానే బాస్ అన్నట్టుగా సజ్జల వ్యవహరిస్తూ వచ్చారు. తెలుగుదేశం, జనసేన నాయకుల మీదికి పోలీసులను ఉసిగొల్పడంలో ఆయనదే ప్రధానపాత్ర. ఆ రకంగా పోలీసులను ఉసిగొల్పే వ్యవహారాలన్నీ తన చేతులమీదుగా నడిపించినందువల్లనే.. ఆయన ప్రస్తుతం ముంబాయి నటి కాదంబరి జత్వానీ కేసులో కూడా ఒక నిందితుడుగా ఇరుక్కునే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.
సజ్జల రామక్రిష్ణారెడ్డి కి తెదేపా ఆఫీసుపై డాడి కేసులోతాను అరెస్టుకాక తప్పదనే భయం పట్టుకుంది. ఆయన ఈ నెల 7వ తేదీన విదేశాలకు వెళ్లారు. 10వ తేదీన ఆయన పేరుమీద లుక్ అవుట్ నోటీసు కూడా జారీఅయింది. పోలీసులు కావాలనే తనపై లుక్ అవుట్ నోటీసు ఇచ్చారని ఇప్పుడు సజ్జల అంటున్నారు. అయితే సజ్జల రెండు రోజుల కిందట విదేశాలనుంచి నేరుగా ముంబాయి ఎయిర్ పోర్ట్ లో దిగినప్పుడు అక్కడి విమానాశ్రయ పోలీసులు నిర్బంధించారు. ప్రస్తుతానికి అరెస్టు అక్కర్లేదని విజయవాడ పోలీసులు చెప్పిన తర్వాత విడిచిపెట్టారు. కేవలం ఆ లుక్ అవుట్ నోటీసుల కారణంగా మాత్రమే సజ్జల విదేశాల నుంచి వచ్చినట్టుగా పోలీసులకు అర్థమైంది. ఆయనను విచారణకు రావాల్సిందిగా నోటీసులు సర్వ్ చేశారు. కాగా, అరెస్టు తప్పకపోవచ్చునని సజ్జల ఆందోళన చెందుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం ఆఫీసు మీద దాడి జరగడానికి సరైన కారణం ఉన్నదని సజ్జల అంటున్నారు. ఈ విషయంపై కోర్టుకు వెళతానని అంటున్నారు. అసలే అరెస్టు భయంతో ఆయన ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రమయిస్తే ఫలితం దక్కలేదు. తీరా సుప్రీం కోర్టుకు వెళ్లిన తర్వాత.. బెయిలు ఇవ్వలేదు గానీ, అరెస్టు చేయకుండా చూడాలని, విచారణకు సజ్జల పూర్తిగా సహకరించాలని అన్నారు. అవన్నీ మర్చిపోయి. విచారణకు పిలవడాన్నే తప్పుబడుతూ సజ్జల మాట్లాడడం చిత్రంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.
విచారణకు సజ్జల డుమ్మా! భయపడుతున్నారా?
Wednesday, December 18, 2024