మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, యువ దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “సంబరాల ఏటి గట్టు” ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ప్రారంభ ప్రకటనతోనే మంచి క్రేజ్ అందుకున్నా, ఇప్పుడు విడుదలైన గ్లింప్స్ తో మాత్రం అంచనాలు మరింత ఎగబాకాయి.
తేజ్ బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్‌లో హీరో లుక్, అటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ మాస్ ఆడియన్స్‌కి పండుగలా మారాయి. సాయి తేజ్‌ను దర్శకుడు పూర్తిగా బీస్ట్ మోడ్‌లో చూపించగా, ప్రతి షాట్ లో కనిపించిన ఇంటెన్సిటీ, టేకింగ్, విజువల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.
అదే సమయంలో సినిమా మీద పెట్టిన బడ్జెట్ కూడా తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. విజువల్స్, సెట్స్, యాక్షన్ సీక్వెన్సులు అన్నీ గ్రాండ్ లుక్‌కి దోహదపడ్డాయి. గ్లింప్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కూడా రివీల్ చేసిన సన్నివేశాలకు మాస్ ఎనర్జీని జోడించింది.
