మెగా కుటుంబానికి చెందిన హీరోల్లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. విరూపాక్ష, బ్రో వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ఒక భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాతో వస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పేరు “సంబరాల ఏటి గట్టు”. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు.
తాజాగా సినిమా టీమ్ నుంచి ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు విడుదల చేసిన పోస్టర్‌లో సాయి ధరమ్ తేజ్ సిక్స్ ప్యాక్ లుక్‌తో అదరగొట్టారు. ఈ కొత్త లుక్‌ని చూసి అభిమానులు, సినీప్రేమికులు మరింతగా ఎగ్జైట్ అవుతున్నారు. తేజ్ తన ఎనర్జిటిక్ ప్రెజెన్స్‌తో ఫ్యాన్స్‌కి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినట్టే కనిపిస్తోంది.
