పాపం శ్రీరెడ్డి.. ‘బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదు!

Sunday, December 22, 2024

మహిళలు బూతులు మాట్లాడడం ద్వారా పాపులారిటీ సంపాదించుకోగలరు.. అనే సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరెడ్డి. జగనన్న మీద అపరిమితమైన అభిమానాన్ని వెల్లువెత్తిస్తూ కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో తన వీడియోలను చూస్తూ ఉండే యువతరానికి జగనన్నను గెలిపించే బాధ్యతను తెలియచెప్పిన సెలబ్రిటీ శ్రీరెడ్డి.

ఆమె పార్టీ నాయకురాలు కాదు గాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం అక్కడి అందరి నాయకుల కంటే ఎక్కువే సేవలు చేశారు. ఎన్ని చేసినా ప్రజల ఛీత్కారం ముందు ఆ సేవలు వెలవెలబోయాయి. అత్యంత ఘోరమైన పరాభవం జగనన్నకు ఎదురైన తర్వాత శ్రీ రెడ్డి కూడా బహుశా షాక్ నుంచి ఇంకా తేరుకున్నట్టు లేదు అందుకే కొత్తగా నోరు పారేసుకోవడం తగ్గించారు.

బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు శ్రీరెడ్డి పరిస్థితిని చూస్తే ఆ సామెత గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆమె ప్రస్తుతానికి తిట్టడం మానుకున్నారు గాని, ఆమె అభిమానించే జగనన్న అధికారంలో ఉన్న రోజుల్లో విచ్చలవిడి బూతులతో తెలుగుదేశం, జనసేన నాయకుల మీద నోరు పారేసుకున్న తీరుకు సంబంధించి పర్యవసానాలు ఆమెకు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ ల మీద ఎన్నికలకు ముందు అసభ్యకరమైన భాషలో వ్యాఖ్యలు చేస్తూ అనేక వీడియోలు చేసిన శ్రీ రెడ్డి మీద కర్నూలులో పోలీసు కేసు నమోదు అయింది. ఇక్కడి తెలుగుదేశం నాయకులు శ్రీ రెడ్డి అనుచిత  వ్యాఖ్యల మీద చర్య తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేక సెక్షన్ల కింద ఆమెపై కేసులు నమోదు అయ్యాయి.

హైదరాబాదులో అనేక వివాదాలలో ఇరుక్కున్న తర్వాత శ్రీరెడ్డి తన మకాం చెన్నైకి  మార్చారు. కానీ కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అన్నట్లుగా శ్రీరెడ్డి నేరం చేసినట్టుగా ఆధారాలు కూడా దొరికితే గనుక పోలీసులు చెన్నై నుంచి ఆమెను అరెస్టు చేసి తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విమర్శలు అవసరమే గాని హద్దులు మరిచిపోవడం, బూతులు అసభ్యపు భాష తన ముద్రగల శైలిగా విర్రవీగడం అనేది ఏదో ఒక నాటికి ముప్పు తీసుకొస్తుందని శ్రీ రెడ్డి ఉదంతం నిరూపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles