మిస్టర్ బచ్చన్‌ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల!

Saturday, July 20, 2024

హరీష్ శంకర్ డైరెక్షన్‌ లో టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. షాక్, మిర‌ప‌కాయ్ వంటి సూపట్ హిట్స్ సినిమాల తర్వాత వీరి కాంబోలో రాబోతున్న మూడో సినిమా  పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీకి సంబంధించి విడుదలైన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ మంచి బజ్ క్రియేట్ చేయగా.. రీసెంట్ గా ‘షో రీల్’ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ని అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు చిత్ర బృందం. మిస్టర్ బచ్చన్ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను అభిమానుల ముందుకు వదిలారు. ఇందులో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తో రవితేజ రొమాన్స్ పిక్‌ రేంజ్ లో ఉంది. దీన్ని బట్టి ఫస్ట్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అని అర్థమవుతుంది.

జస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే వినిపిస్తున్న ఈ ప్రోమో చూస్తుంటే రవితేజ – హరీష్ శంకర్ ల ‘మిరపకాయ్’ సినిమానే గురొస్తుంది. ఆ సినిమాలో ‘గది తలుపుల బిడియం’ అనే రొమాంటిక్ సాంగ్ తరహాలోనే మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ ఉండబోతుంది. ఈ సాంగ్ లో హీరో,హీరోయిన్ మధ్య ఘాటు రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని జస్ట్ ప్రోమో తోనే చెప్పేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles