రోజా చిల్లర మాటలు : ఛీకొడుతున్న జనం!

Thursday, December 26, 2024

పుంగనూరులో జరిగిన అస్పియా హత్యను రాజకీయంగా వాడుకోవడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ధైర్యం చాలడం లేదు. కానీ.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. దాదాపుగా ఇంటికే పరిమితమై గడుపుతున్న మాజీ హీరోయిన్ రోజా మాత్రం చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు పరిపాలనలో మహిళలకు, పసిపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతున్నదని అంటున్నారు. అస్పియా తండ్రి చేస్తున్న ఫైనాన్స్ వ్యాపారంలో వచ్చిన తగాదాలు, ఆయనమీద ఉన్న కక్ష కారణంగా ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చిన తర్వాత కూడా నటి రోజా అంత చిల్లరగా మాట్లాడడం ప్రజలకు చీదర పుట్టిస్తోంది. ఈ చిన్నారి హత్యకు కూడా రాజకీయ రంగు పులమడం ఆమె నీచత్వానికి పరాకాష్ట అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

పుంగనూరులో అస్పియా అనే ఏడేళ్ల చిన్నారి హత్య జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ హత్య సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబాన్ని అక్కడి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి వెళ్లి పరామర్శించారు కూడా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శించడానికి వెళ్లబోతున్నారు. సెప్టెంబరు 29వ తేదీన అస్పియా అదృశ్యం కాగా, అక్టోబరు 2వ తేదీన ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. అప్పటినుంచి ఈ హత్య చుట్టూ రకరకాల అనుమానాలు ప్రచారం జరుగుతూ వచ్చాయి. అత్యాచారం జరిగిందని కూడా తొలుత అనుకున్నారు.

అయితే అస్పియా పై అ్యతాచారం జరగలేదని పోస్టుమార్టం తేల్చినట్టుగా పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన వారిని కూడా అరెస్టు చేశారు. చిన్నారి తండ్రితో ఉన్న ఆర్థిక విభేదాల కారణంగానే కిడ్నాప్ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే ఈ హత్యను రాజకీయానికి వాడుకునే చిల్లర బుద్ధులు వైఎస్సార్ కాంగ్రెస్ లో కొందరు నాయకులు బయటపెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎవరో ఒకరు చస్తే, ఆ చావులకు చంద్రబాబే కారణం అంటూ తిట్టడానికి తప్ప.. ఇక తాను ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏదీ లేదన్నట్టుగా నటి రోజా కూడా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని చంద్రబాబు తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారని, ప్రజల భద్రతను గాలికొదిలేశారని ఆమె అంటున్నారు. రోజా మాటలు చాలా చిల్లరగా ఉన్నాయని దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అని అంటున్నారు. పుంగనూరు పర్యటిస్తే జగన్ కూడా ఇలాంటి చిల్లర మాటలే మాటలే మాట్లాడతారా? లేదా, బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో సరిపెడతారా? అని అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles