మహేష్ బాబు చేతుల మీదుగా ‘రాబిన్‌హుడ్’ బ్రాండ్‌ సాంగ్‌!

Saturday, March 29, 2025

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ మార్చి 28న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ఇక తాజాగా వాలెంటైన్స్ డే కానుకగా ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సాంగ్‌ను లాంచ్ చేశారు. ‘వేరెవర్ యు గో’ అంటూ సాగే ఈ పాట పలు బ్రాండ్స్ పేర్లతో సాగుతుంది. చాలా క్రియేటివ్‌గా ఈ సాంగ్‌ను కొరియోగ్రాఫ్ చేశారు. జి.వి.ప్రకాష్ కుమార్ చక్కటి ట్యూన్స్ కంపోజ్ చేయడంతో ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉంది.

ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles