వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం దౌర్జన్యాల ఆధారంగానే గెలవాలని తలపోసినట్లుగా ఎన్నికల నాడు గానీ, ఆ తర్వాతి పరిణామాలు గానీ స్పష్టం చేసేశాయి. కానీ ప్రతి దశలోను, ప్రతిచోట తెలుగుదేశం కార్యకర్తలు కూడా దీటుగా స్పందించడం.. నిర్భయంగా నిలబడడం వల్ల.. అంతో ఇంతో పద్ధతిగా పోలింగ్ ముగిసిందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఎన్నికల పర్వంలో ఇంకా కీలకమైన కౌంటింగ్ మిగిలే ఉంది. కౌంటింగ్ నాడు కూడా మరింత పెద్దస్థాయిలో విధ్వంసం సృష్టించడం ద్వారా.. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని, అసలు ప్రత్యర్థి పార్టీల ఏజంట్లుగా ఎవరైనా రావడానికే భయపడే పరిస్థితి కల్పించాలని ఇప్పటినుంచే వ్యూహరచనలు సాగుతున్నట్టుగా సమాచారం బయటకు వస్తోంది.
ఈ క్రమంలో అసలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల దందాలకు, దౌర్జన్యాలకు జడుసుకుని విధులనుంచి పారిపోయే మార్గాలు వెతుక్కుంటున్నట్టుగా కనిపిస్తోంది. ప్రత్యేకించి.. పోలింగ్ అనంతర అల్లర్లలో మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి ప్రాంతాలు ఎక్కువగా వార్తల్లోకి వచ్చాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆర్వో రాంభూపాల్ రెడ్డిని అనారోగ్య కారణాల రీత్యా తప్పించి, మరొకరిని కౌంటింగ్ సమయానికి ఆర్వోగా నియమిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. అయితే.. రాంభూపాల్ రెడ్డి.. కౌంటింగ్ నాడు పెద్ద ఎత్తున హింస చెలరేగే అవకాశం ఉన్నదని తెలిసి, ముందే ఆరోగ్య కారణాల నెపం పెట్టి తప్పించుకున్నట్టుగా కూడా పలువురు భావిస్తున్నారు.
అలాగే.. ఒంగోలులో ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీచేసిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. అక్కడి మహిళా ఆర్వోను తీవ్రస్థాయిలో బెదిరించారు. ప్రెవేటు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతానని హెచ్చరించారు. సదరు ఆర్వోను కూడా ఈసీ విధులనుంచి తప్పించింది. పోలింగ్ ముగిసిన తర్వాత.. 14వ తేదీ ఉదయం ఈవీఎంలను స్ట్రాంగురూముకు తరలించి సీలు వేయాల్సిన విషయంలో ఆలస్యం చేసినందుకు ఆమెను తప్పించినట్టుగా చెబుతున్నారు గానీ.. ప్రజల్లో చెలామణీ అవుతున్న వాదనను బట్టి.. కౌంటింగ్ నాడు.. చెవిరెడ్డి అనుచరులు ఎలాంటి విధ్వంసానికి పాల్పడతారో అనే భయంతో ఆమె అనధికారికంగా రిక్వెస్టు చేసి మరీ తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇది ప్రారంభం మాత్రమేనని, రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత మధి ఆర్వోలు, ప్రధానంగా మహిళా అధికారులు.. వైసీపీ నాయకులకు జడిసి.. ఆర్వో బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారని తెలుస్తోంది.
వైసీపీ దౌర్జన్యాలకుభయపడి పారిపోతున్న ఆర్వోలు!
Sunday, December 22, 2024