ప్రముఖ లిరిసిస్ట్‌ కులశేఖర్‌ కన్నుమూత!

Wednesday, March 12, 2025

టాలీవుడ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత కులశేఖర్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన గాంధీ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

తన కెరీర్‌లో ఓ వెలుగు వెలిగిన సినీ రైటర్‌గా కులశేఖర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్రం, ఔనన్నా కాదన్నా, ఘర్షణ, భద్ర, నువ్వు నేను, సంతోషం, జయం వంటి హిట్ చిత్రాలకు కులశేఖర్ పాటలు సమకూర్చారు. ఇక ఆ తరువాత ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలేవి  పడలేదు.

దీంతో ఆయన కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. దీంతో ఆయన మానసికంగా కుంగుబాటుకు గురయ్యారు.ఇప్పుడు ఇలా ఆయన చివరి రోజుల్లో అత్యంత దయనీయ స్థితిలో మృతి చెందడం సినీ అభిమానుల్ని కలచివేస్తుంది. కులశేఖర్ మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles