హీరోగా రవితేజ తమ్ముడి కుమారుడి ఎంట్రీ!

Thursday, June 20, 2024

మాస్‌ మహారాజా రవితేజ గురించి ఇండస్ట్రీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సైడ్‌ హీరోగా సినిమాలు మొదలు పెట్టిన ఆయన స్టార్‌ హీరోగా ఎదిగారు. చాలా మంది యంగ్ హీరోలకు రవి కెరీర్‌ ఆదర్శం అని చెప్పవచ్చు. అయితే రవితేజ క్రేజ్ తో తన ఇద్దరు తమ్ముళ్లు కూడా సినీ ఇండస్ట్రీలో మంచి పాత్రలలో నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే రవితేజ ఇప్పుడు తన తమ్ముడు కొడుకును హీరోగా ఇండస్ట్రీకి తీసుకువస్తున్నాడు.  

రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. మాధవ్ హీరోగా గౌరీ రోనంకి దర్శకత్వంలో మిస్టర్. ఇడియట్ అనే చిత్రం రూపుదిద్దుకుంటుంది. అయితే రవితేజ కెరీర్ లో డాషింగ్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ఇడియట్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మాధవ్ కూడా పెదనాన్న హిట్ సినిమా టైటిల్ తోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్ గా చేస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. “మిస్టర్. ఇడియట్ “మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles