బాలీవుడ్‌ లో సూపర్ ఆఫర్ పట్టేసిన రష్మిక!

Monday, May 20, 2024

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న గురించి ఏ ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేదు. రెండేళ్ల కిందట వచ్చిన పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకుంది. అదే క్రేజ్ తో బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. గతేడాది రణబీర్ కపూర్ కు జోడిగా యానిమల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొట్టేసింది

 ఇప్పుడు అదే జోష్ తో మరో బంఫర్ ఆఫర్ పట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రష్మికకు కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన జోడి కట్టేందుకు ఛాన్స్ దొరికినట్టు సమాచారం. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే సికందర్ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా లైన్ బాగుండటంతో ముందుగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర బృందం రెడీ అవుతుంది.

సల్మాన్ ఖాన్ కు జోడిగా రష్మిక ను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనని యూనిట్ టాక్.. సౌత్ లో వచ్చినట్లు నార్త్ లో సినిమా ఆఫర్స్ రావడం కష్టం.. కానీ ఈ అమ్మడు లక్ వల్లే మరో ఆఫర్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప 2, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర సినిమాలన్నీ కూడా హిందీలోకి డబ్‌ కాబోతున్నాయి.

 అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ VD14 సినిమాలో నటిస్తుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles