సెన్సార్‌ పూర్తి చేసుకున్న రామం రాఘవం..!

Thursday, September 19, 2024

ప్రముఖ నటుడు, డైరెక్టర్‌, మాటల రచయిత సముద్ర ఖని, స్టార్‌ కమెడియన్ ధన్ రాజ్ ప్రధాన పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్న సినిమా రామం రాఘవం. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ స్టోరీ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్‌ కొత్త పోస్టర్‌ విడుదల చేసి అభిమానులకు, ప్రేక్షకులకు తెలియజేశారు.

ధన్ రాజ్ డైరెక్షన్‌ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో హరీష్ ఉత్తమన్, సత్య, మోక్ష సేన్ గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీ రాజ్ లు కీలక పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్న ఈ సినిమాని స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై పృథ్వీ పొలవరపు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles