తమిళ స్టార్ హీరో రజినీకాంత్ నటించిన కూలీ సినిమా షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించగా, ఆగస్ట్ 14న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. రజినీ అభిమానులు కూలీ కోసం ఎదురుచూస్తుండగానే, ఆయన మరో సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు.
రజినీ ప్రధాన పాత్రలో వస్తున్న జైలర్ 2కి నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కాస్తా తాజాగా కోలీవుడ్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అందుకు కారణం, ఈ సీక్వెల్‌లో ప్రతినాయక పాత్ర కోసం మేకర్స్ టాలీవుడ్ స్టార్ నాగార్జునను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి.
ముందే కూలీ సినిమాలో రజినీతో నాగార్జున నటించగా, ఇప్పుడు జైలర్ 2లో ఆయనను విలన్ రోల్ కోసం మళ్లీ మేకర్స్ అప్రోచ్ అయినట్లు టాక్. అయితే నాగార్జున ఇప్పటివరకు ఈ విషయంపై తన నిర్ణయం వెల్లడించకపోవడం మరో ఆసక్తికర అంశం.
ఇకపోతే తమిళ మీడియాలో నాగార్జున జైలర్ 2లో విలన్‌గా కనిపిస్తాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వస్తే అభిమానులకు మరింత ఉత్సాహం కలిగించేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
