ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా హడావుడి చేసిన వార్త ఏదైనా ఉందా అంటే అది రజినీకాంత్, కమల్ హాసన్ ఒకే సినిమాకి వస్తున్నారన్న టాక్ అని చెప్పాలి. ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పటికే కమల్‌తో విక్రమ్, రజినీకాంత్‌తో కూలీ లాంటి సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూపించబోతున్నాడన్న మాట బయటకు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
అంతలోనే కమల్ హాసన్ ఓ పబ్లిక్ ఈవెంట్‌లో మాట్లాడిన విషయం మరింత ఆసక్తిని కలిగించింది. ఆయన మాట్లాడుతూ తమ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడో రావాల్సింది కానీ కొద్దిగా ఆలస్యం అయ్యిందని, ఇక ఇప్పుడు ఇద్దరం కలిసి వస్తున్నామని చెప్పేశారు. అలాగే ఈ మల్టీస్టారర్ కేవలం అభిమానులను మాత్రమే కాకుండా బిజినెస్ పరంగా కూడా పెద్ద సర్ప్రైజ్ అవుతుందని సూచించారు.
