కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఇటీవల మంచి విజయాన్ని సాధించింది. అజిత్ కి పక్కా అభిమానిగా పేరున్న అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాని మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ తో తీర్చిదిద్దారు. అభిమానులను ఉత్సాహపరిచే ఎలిమెంట్స్ తో పాటు పాత హిట్ పాటలను కూడా వాడుతూ ప్రత్యేకమైన ట్రీట్ ఇచ్చారు. కానీ ఆ పాటల వాడకమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
సినిమాలో ఇళయరాజా స్వరపరిచిన పలు క్లాసిక్ పాటలు ఉపయోగించడంతో ఆయన కాపీరైట్ కేసు వేసి కోర్టుకి వెళ్లారు. ఈ వివాదంలో ఇళయరాజాకే అనుకూలంగా తీర్పు రావడంతో గుడ్ బ్యాడ్ అగ్లీని నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగించారు.
