విజయసాయి పెడబొబ్బలపై రఘురామ సెటైర్లు!

Monday, July 22, 2024

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ కుటిల రాజకీయాలను షురూ చేసింది. ఓడిపోయిన నాటినుంచి జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా పదేపదే ఈవీఎంల్లో మాయ జరిగిందని అంటున్నారు. ఏం మాయ జరిగిందో ఆధారాలు లేవని, దేవుడికే తెలుసునని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. దేవుడే తనని అత్యంత ఘోరంగా ఓడించినట్టు ఆయన గుర్తించడం లేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీ వారు అరాచకాలు చేస్తున్నట్టుగా, తమ పార్టీ వారి మీద దాడులు చేస్తున్నట్టుగా చెలరేగిపోతున్నట్టుగా కూడా గోల చేస్తున్నారు. ఇన్నాళ్లుగా తాను సాగించిన  అరాచక పాలన ఇంకా కొనసాగుతున్నట్టు జగన్ కలగంటున్నారో ఏమో తెలియదు గానీ.. అలాంటి ఆరోపణలు అనేకం చేస్తున్నారు.

జగన్ కు తోడు- జగన్ వందిమాగధుల్లో ముఖ్యులైన విజయసాయిరెడ్డి కూడా అదే పనిచేస్తున్నారు. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇంకా పదిలంగా ఉన్నది గనుక.. ఢిల్లీలో కూర్చుని ఏపీలో తెలుగుదేశం వారు తమ పార్టీ వారి మీద  దాడులుచేస్తున్నట్టుగా అబద్ధాలను ప్రచారంలో పెడుతున్నారు. అయితే విజయసాయి ఇలా పెడబొబ్బలు పెడుతుండడంపై తెదేపా ఎమ్మెల్యే రఘురామక్రిష్ణ రాజు సెటైర్లు వేయడం విశేషం.

విజయసాయిరెడ్డి ఢిల్లీలో పెడబొబ్బలు పెడుతున్న తీరు.. దొంగే.. ఎదుటివారిని దొంగా దొంగా అని కేకలు వేసినట్టుగా ఉన్నదని రఘురామ అంటున్నారు. నేను ఎంపీగా ఉన్నప్పటికీ నా మీద తప్పుడు కేసులు పెట్టి.. పట్టపగలే ఇంట్లోంచి అరెస్టు చేసి తీసుకువెళ్లి.. అర్ధరాత్రి వరకు వాహనాల్లో తిప్పుతూ దారుణంగా కొట్టారు. దీనిపై అన్ని ఆధారాలున్నప్పటికీ.. ప్రభుత్వం ఎలాంటిచర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఎన్నో దుర్మార్గాలు చేసిన వారు.. నేడు ఏమీ జరగకముందే ఏదో జరిగిపోతోందని గోల చేస్తున్నారు. అపోహలతో తమని కొడుతున్నారని, చంపేస్తున్నారని పెడబొబ్బలు పెడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు..అని విమర్శించారు.

అయినా సరే వైసీపీ వారి పెడబొబ్బలు ఇప్పట్లో ఆగేలా లేవు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేనట్టుగా ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టే లా మాట్లాడుతుండడం జరుగుతూనే ఉందని ప్రజలు అంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles