యాగాలతో జగన్ చేసిన పాపాల ప్రక్షాళన!

Sunday, December 22, 2024

దేవదేవుడిని సేవించుకోవడంలో ఏదైనా అపచారం జరిగితే ఏమవుతుంది? ఆ అపచారానికి ప్రాయశ్చిత్తంగా పరిహారంగా కొన్ని యాగాలు క్రతువులు ఉంటాయి. వాటిద్వారా దేవుడి ఎదుట జరిగిన తప్పును ఒప్పుకుంటూ, స్వామిని వేడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తిరుమల లడ్డూ నెయ్యి విషయంలో జరిగిన ఘోరమైన పాపానికి అలాంటి పరిహారాలను టీటీడీ అధికారులు అన్వేషిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆగమపండితులతో కలిసి పాపపరిహారార్థం చేయవలసిన క్రతువులను గురించి ఆలోచిస్తున్నారు.

జగన్ సర్కారు హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో అనేకానేక అపచారాలు జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. అసలు తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనుక భాగంలో అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రకటనల ముద్రణ దగ్గరినుంచి, తిరుమలలో అన్యమత ప్రచారాన్ని చేసే వారిని దొంగచాటుగా ప్రోత్సహించడం వరకు అనేక వ్యవహారాలు ఉన్నాయి. తిరుమల స్వామివారి సేవలో తరించవలసిన గౌరవప్రదమైన పదవుల్లో అన్యమత విశ్వాసులను, అన్యమత అవలంబికులను నియమించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా క్రిస్టియానిటీ అవలంబించే వ్యక్తి. కానీ ఆయన ఏనాడూ తిరుమల సాంప్రదాయాలను, మర్యాదలను కట్టుబాట్లను గౌరవించలేదు. తిరుమల స్వామివారి పట్ల విశ్వాసం చూపిస్తాననే డిక్లరేషన్ మీద ఏనాడూ సంతకం చేయలేదు. క్రిస్టియనుగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా దైవదర్శనానికి వెళ్లేవారు. స్వామివారికి వస్త్రాలను ప్రభుత్వాధినేతగా సమర్పించిన ఏ సందర్భంలో కూడా ఆయన భార్యతో సహా తిరుమల స్వామివారి సేవలో పాల్గొనలేనేలేదు. ఆయన స్వయంగా చేసిన అపచారాలే చాలా ఉన్నాయి.

ఆ తరహాలో ఆయన ప్రభుత్వ హయాంలో ఆయనకు తగ్గట్టుగానే టీటీడీ పాలకులుకూడా విచ్చలవిడిగా వ్యవహరించారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిని  పందికొవ్వు, గొడ్డు కొవ్వులతో కల్తీ చేయడం అనేది వారి అరాచకాలకు పరాకాష్ట. ఈ పాపాలన్నింటికీ పరిహారంగా మహాశాంతి యాగం లేదా, సంప్రోక్షణ యాగదం నిర్వహించాలనే ఆలోచనను ఆగమపండితులు పంచుకుంటున్నారు. ఏ రకంగా ముందుకెళతారో వేచిచూడాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles