మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ అభిమానుల్లో క్రేజ్ పెంచుతున్నాయి. ఇటీవల విడుదలైన స్టిల్ మెగా అభిమానులను ఆకట్టుకోగా, ఇప్పుడు మరొక ప్రత్యేక ఫోటో బయటకు వచ్చి హంగామా చేస్తోంది.
ఇదిలా ఉంటే, విజయ్ సేతుపతి హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక ఇంట్రెస్టింగ్ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే ఈ రెండు సినిమాల టీమ్స్ అనుకోకుండా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. చిరంజీవి, విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్, ఛార్మి, అనీల్ రావిపూడి, నయనతారతో పాటు మరికొంతమంది నటీనటులు కలిసి దిగిన ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
