రిమాండులో పీఎస్సార్ : రెండునాల్కల ధోరణి!

Tuesday, December 9, 2025

సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసినప్పుడు.. ఆయన చాలా తాత్వికంగా మాట్లాడారు. మీరు అరెస్టు చేస్తారని నాకు వారం ముందే తెలుసు.. అయినా ప్రాప్తం ఉంటే వస్తుంది.. ఒకసారి జైలు చూసి వద్దామని అనుకున్నాను. అందుకే ముందస్తు బెయిలుకోసం కూడా అప్లయి చేయలేదు.. అని వేదాంతం ప్రకటించారు. తీరా ఇప్పుడు రిమాండులో విజయవాడ సెంట్రల్ జైలులో ఉండాల్సి వచ్చేసరికి ఆయనకు అసలు తత్వం బోధపడుతున్నట్టుగా ఉంది. బయట ఉన్నప్పుడు జైలు అనుభవం కోరుకున్న ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి, జైలుకు వెళ్లిన తర్వాత.. అక్కడ అంతా ఇంటిలో సాగినట్టే వైభవం సాగాలని కోరుకుంటున్నారు. ఆ మేరకు తన కోరికల చిట్టాతో కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

ఒకసారి జైలు జీవితం చూసి రావాలనిపించింది.. అని ప్రకటించడం ద్వారా.. పీఎస్సార్
ఆంజనేయులు సీఐడీ పోలీసులతో ఒక రకమైన మైండ్ గేమ్ ఆడారు. ‘మీరు అరెస్టు చేస్తున్నారు గనుక.. నేను అరెస్టు కాలేదు. నేను అరెస్టు కాదలచుకున్నాను గనుక.. అరెస్టు అయ్యాను’ అన్నట్టుగా ఆయన సెలవిచ్చారు. మరి జైలు జీవితం చూసి రావడం అంటే.. ఏదో విజిటింగ్ పాస్ తీసుకుని ఒక రౌండ్ అటూ ఇటూ తిరిగి రావడం కాదు కదా.. జైలులో కొన్నాళ్లు గడిపితే తప్ప.. అక్కడి అనుభవం ఎలాంటిదో బోధపడదు కదా? కానీ.. పీఎస్సార్ ఆంజనేయులు సెంట్రల్ జైలుకు వెళ్లిన తర్వాత.. అన్ని రకాల సదుపాయాలూ కోరుకుంటున్నారు. ఆయనకు అక్కడ అందరితోపాటు సెల్ లో పెట్టడం నచ్చడం లేదుట. ఆయనకు ప్రత్యేకంగా ఒక గది కావాలట. గదితో పాటు ఆ గదిలో ఒక మంచం కూడా కావాలట. (ఆ తరువాత పరుపూ దిండూ కూడా ఆటోమేటిగ్గా అడుగుతారు.) భోజనం గానీ, మంచినీళ్లు గానీ ఇంటినుంచి తెప్పించుకోవడానికి అనుమతి కావాలట. ఇవన్నీ ఇచ్చిన తర్వాత.. ఆయనకు అంతా ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది గానీ.. జైల్లో గడుపుతున్న ఫీలింగ్ ఎలా వస్తుందనేది సామాన్యుల ప్రశ్న.

నిత్యానుష్ఠానం చేసుకోవడానికి .. ప్రతిరోజూ ద్విసంధ్యాలూ సంధ్యావందనం చేసుకోవడానికి తొలిరోజే అమనుతి కోరిన, సంధ్యావందనం సామగ్రి మొత్తం తన వెంట జైలుకు తీసుకువెళ్లిన ఈ సదాచార పరాయణుడైన సీనియర్ ఐపీఎస్ పాపం.. జైలులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టున్నారు. ఆయన అడిగినవన్నీ ఇవ్వడానికి జైలు నిబంధనలు ఒప్పుకుంటాయో లేదో చెప్పాలని కోర్టు  ఆదేశించింది.
అయితే కొన్నాళ్లు జైలులో గడపాలని మాత్రమే అరెస్టు అవుతున్నానని, అందువల్లనే ముందస్తు బెయిలుకోసం అప్లయి చేసుకోలేదని చెప్పిన ఆంజనేయులు.. అక్కడకు వెళ్లిన వెంటనే బెయిలకోసం మాత్రం దరఖాస్తు చేసుకున్నారు. అలా ఎలా సార్.. జైలులో గడపాలన్న మీ ముచ్చట తీరాలంటే కొన్నాళ్లు అక్కడే గడపాలి కదా.. అని ప్రజలు అంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles