ఏపీ ప్రజలకు భరోసా కల్పిస్తోన్న ప్రజాదర్బార్‌.. నేనున్నానంటున్న లోకేశ్‌ బాబు!

Sunday, December 22, 2024

ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కష్టాల్లో ఉన్న వారందరికీ అండగా నిలుస్తున్నారు. మంగళగిరితో పాటు ఏపీ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజాదర్బార్ కు తరలివచ్చి తమ సమస్యలను మంత్రి గారికి లోకేశ్‌ కి వినిపిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు.

ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి, ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి లోకేష్‌ వారికి భరోసా ఇస్తున్నారు. ప్రజల సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. దివ్యాంగులకు గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆశయ సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు  లోకేశ్ ను కలిసి వారి సమస్యలను విన్నవించారు.. గత వైసీపీ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇళ్లకు తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారని తెలిపారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తమ సొంతింటి కల నెరవేరేలా టిడ్కో ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని యువనేతను కోరారు.

సమస్యను విన్న నారా లోకేశ్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తన కుమార్తెకు పూర్తిస్థాయి అంగవైకల్యం ఉందని, ఆ విధంగా దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన షేక్ భానుభి, దివ్యాంగ పెన్షన్ కోసం నులకపేటకు చెందిన ఆంజనేయులు లోకేశ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో దివ్యాంగుడైన తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎం. వంశీకృష్ణ కోరారు.

గత ప్రభుత్వంలో నిలిపివేసిన రైతు కూలీ పెన్షన్ ను పునరుద్ధరించాలని యర్రబాలెం గ్రామానికి చెందిన  ఓ రైతు కూలీ కోరారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు నీట్ పరీక్ష ద్వారా బీ-కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వచ్చిందిని, ఫీజు రాయితీ కల్పించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా అనంతవరానికి చెందిన సీహెచ్.అనూష మంత్రి లోకేష్ కు విజ్ఙప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ ప్రజలకు భరోసా కల్పించి సంతోషంగా ఇంటికి వెళ్లేలా చేస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles