పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో విషేషంగా పేర్కొనవలసినది, అతని కెరీర్‌లో మొదటిసారి హారర్ జానర్‌లో రూపొందుతున్న “ది రాజా సాబ్” సినిమా. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పై మొదటి నుండి మంచి ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో కొనసాగుతోంది.
ఇటీవల నిర్మాత వెల్లడించిన ఓ విషయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటి వరకు షూట్ చేసిన రఫ్ ఫుటేజ్ మొత్తం నాలుగున్నర గంటలకు పైగా వచ్చిందట. అయితే, ఫైనల్‌గా సినిమా నిడివి సుమారు రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కుదించేలా ఎడిటింగ్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఫుటేజ్‌లో ఏ సన్నివేశాలు తీసివేస్తారన్నది చూడాలి.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ హారర్ ఎంటర్టైనర్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
