ప్రభాస్‌ ని ఢీకొట్టడానికి రెడీ అవుతున్న బాలీవుడ్ బడా స్టార్స్‌!

Friday, December 5, 2025

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘ది రాజా సాబ్’పై భారీగా హైప్ నెలకొంది. హార్రర్‌ ఫాంటసీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లోని విజువల్స్, ప్రభాస్ స్టైల్, మేకింగ్ స్టాండర్డ్స్ అన్నీ కలిపి ఈ సినిమా మీద క్రేజ్ ని మరింత పెంచేశాయి.

ఇక ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నవిడుదల తేదీని కూడా మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ వెర్షన్ మీద కూడా మంచి బజ్ కనిపిస్తోంది. ప్రభాస్ మార్కెట్ ప్రస్తుతం నార్త్ ఇండియాలో కూడా స్ట్రాంగ్ గా ఉండటంతో అక్కడ కూడా ఈ సినిమాకి భారీగానే డిమాండ్ ఉంది.

అయితే ఇదే డేట్ కి బాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి ప్లాన్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ చేస్తున్న కొత్త సినిమా ‘ధురంధర్’ కూడా డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతోంది అని అధికారికంగా ప్రకటించారు. అలాగే షాహిద్ కపూర్ నటిస్తున్న మరో ప్రాజెక్ట్ కూడా అదే తేదీని టార్గెట్ చేసినట్టు ఇండస్ట్రీ టాక్.

దీనితో ‘ది రాజా సాబ్’ బాలీవుడ్ మార్కెట్ లో బిగ్ క్లాష్ కు సిద్ధం అయింది. మూడు పెద్ద సినిమాలు ఒకే రోజున బరిలోకి దిగే అవకాశముండటంతో, నార్త్ బాక్సాఫీస్ వద్ద ఎవరి సినిమా ఎక్కువగా ఆకట్టుకుంటుందన్న ఆసక్తికర పరిస్థితి ఏర్పడింది. ప్రభాస్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో, అదే విధంగా హిందీలో కూడా నిలవగలిగితే మరో బ్లాక్‌బస్టర్ ప్రభాస్ ఖాతాలో పడే ఛాన్స్ ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles