పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న హిస్టారికల్ పీరియడ్ డ్రామా హరిహర వీరమల్లు సినిమాపై ఇప్పుడు మళ్లీ చర్చలు మొదలయ్యాయి. మొదటి నుండి ఈ సినిమా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ, రిలీజ్ తేదీ అనేది మిస్టరీగా మారిపోయింది. గత ఐదేళ్లలో ఎన్నో తేదీలు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈసారి మాత్రం జూన్ 12న విడుదల కాబోతుందని ఎప్పటికీ లేట్ అవ్వదని ఫ్యాన్స్ నమ్మకంగా భావించారు.
అయితే తాజా సమాచారం చూస్తే ఈ జూన్ 12న కూడా సినిమా థియేటర్లకు రావడం కష్టమే అని చెప్పే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాకు అవసరమైన గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తికాలేదట. ఈ కారణంగా ఎప్పటికీ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశే ఎదురయ్యేలా ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ప్రకారం జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారం లాంటి తేదీలే కొత్తగా లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
మొత్తానికి ఇన్నాళ్లుగా ఊరించి చివరికి పక్కా అని అనుకున్న డేట్ కూడా వాయిదా పడేలా కనిపిస్తుండటం ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోతే, ఈ వాయిదా వార్తలు మరింత బలపడే అవకాశం ఉంది. హరిహర వీరమల్లు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, ఫ్యాన్స్‌కి మాత్రం అంతకంతకు నిరాశే మిగులుతోంది.
