పాపం కాకాణి.. కలుగులో ఇంకెన్నాళ్లు దాక్కోవాలో?

Friday, December 5, 2025

మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డికి మాత్రమే కాదు.. ఆయన అజ్ఞాతంలో ఉంచి.. గుట్టుచప్పుడు కాకుండా కాపాడుతున్న వారికి కూడా ఇది చేదు వార్త. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. ఆయనకంటె వారికే ఎక్కువ చేదువార్త. ఎందుకంటే.. ఆయన ఇంకా ఎన్నాళ్లు అజ్ఞాతవాసంలో ఉంటారో క్లారిటీ లేదు. ఎందుకంటే.. తాజాగా కాకాణి గోవర్దన రెడ్డి వేసిన ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం న్యాయస్థానం తిరస్కరించింది. దాంతో ఇప్పటికే దాదాపు రెండు నెలలుగా పరారీలోనే ఉన్న కాకాణి గోవర్దన రెడ్డి.. ఇంకా ఎన్నాళ్లు కలుగులోనే దాక్కుని ఉంటారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతున్న రోజుల్లో  నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నారు. దాదాపు రెండు నెలలుగా ఆయన పోలీసులకు దొరక్కుండా పరారీలోనే ఉన్నారు. గతంలో హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ వేయగా.. వారు తిరస్కరించారు. తాజాగా ఆయన పిటిషన్ ను సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది. పిటిషన్ ను విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి కోరినప్పటికీ నిరాకరించిన సుప్రీం కోర్టు దానిని డిస్మిస్ చేసింది.

జగన్ పాలనకాలంలోనే నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలకు సంబంధించి అనేక  ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశానికి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ విషయంలో పెద్ద పోరాటమే చేశారు.  కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ అక్రమాలకు సంబంధించిన కేసుల్లో కదలిక వచ్చింది. ప్రెస్ మీట్ లో మీసం మెలేసి మరీ.. పోలీసులను బట్టలూడదీయించి నిలబెడతానని కాకాణి గోవర్దన రెడ్డి చాలా సవాళ్లు విసిరారు. అయితే ఈ కేసులో పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించే సమయానికే పరారయ్యారు. నెల్లూరులో పరారై హైదరాబాదులో తేలారు. ఉగాది పండుగను బంధువులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి.. పోలీసులను కవ్వించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి హైదరాబాదులోని బంధువుల నివాసాల మీద దాడి చేసే సమయానికి మళ్లీ పరారయ్యారు. అప్పటినుంచి  ఆయన పోలీసులకు చిక్కకుండా కలుగులో దాక్కున్నట్టుగా దాగుడుమూతలు ఆడుతున్నారు.

సుప్రీం ద్వారా ముందస్తు బెయిలు దొరికితే.. బాహ్యప్రపంచంలోకి వస్తారని అంతా అనుకున్నారు గానీ.. ఆయనకు నిరాశ తప్పలేదు. కాకాణి తరఫున హైకోర్టు మాజీ న్యాయమూర్తి దామా శేషాద్రి నాయుడు తదితరులు సుప్రీంలో వాదనలు వినిపించారు. అయినా.. కనీసం పిటిషన్ ఉపసంహరణకు కూడా అవకాశం ఇవ్వకుండా సుప్రీం తిరస్కరించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles