పోల‘వరమే’ కాదు.. నిర్వాసితులకు వరాల వెల్లువే!

Monday, March 31, 2025

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు పట్ల ఎంత శ్రద్ధగా పనులను పాలో అప్ చేస్తూ ఉండేవారో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అవుతుందనే ఆశతో.. ప్రతి సోమవారాన్ని పోలవారం గా మార్చి సమీక్షలు నిర్వహిస్తూ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా పనులను పరుగులు పెట్టించారో అందరికీ తెలుసు. అలాంటిది విధ్వంసక నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పాత కాంట్రాక్టర్లను పక్కకు తప్పించాలనే దురుద్దేశంతో రివర్స్ టెండరింగ్ పేరుతో గందరగోళం చేశారు. పనులను ఎక్కడివక్కడ స్తంభింపజేశారు. ఆ ప్రభుత్వ నిర్లక్ష్యంతో డయాఫ్రం వాల్ కూడా కొట్టుకుపోయింది. జగన్ పాలన ప్రాజెక్టుకు చేసిన చేటు ఒక ఎత్తుకాగా, ఇంకోవైపు నిర్వాసితుల గురించి అయిదేళ్లు అస్సలు పట్టించుకోలేదు. తాజాగా గురువారం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వాసితులతో సమావేశమై.. వారికి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం వారికి పరిహారం చెల్లించడం మాత్రమే కాదు, ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు వారి పునరావాసం కూడా పూర్తి చేయడానికి, అలాగే ఉపాధి కల్పించడానికి కూడా సమాంతరంగా కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం.. 2027 లో గోదావరి పుష్కరాలు వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలనే సంకల్పాన్ని ప్రకటించారు. అందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అంటూనే.. అంతకంటె ముందు అంటే 2026 డిసెంబరు నాటికే.. నిర్వాసితుల పునరావాసం పనులన్నీ పూర్తిచేసేందుకు చూస్తామని హామీ ఇచ్చారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పాలన పోలవరానికి ఏ రకంగా శాపంగా పరిణమించిందో చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. 400 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మిస్తే వైసీపీ నిర్లక్ష్యం వలన మొత్తం కొట్టుకుపోయిందని, ఇప్పుడు మళ్లీ ప్రత్యేకంగా 990 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే.. 2019 వరకు నిర్వాసితులకు రూ.4311 కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం చెల్లిస్తే.. వైసీపీ హయాంలో పైసా విదిల్చలేదని చంద్రబాబు మండిపడ్డారు. నిర్వాసితులకు రూ.పదిలక్షల పరిహారం ఇస్తానంటూ మోసం చేశారని అన్నారు. వరదల సమయంలో కూడా ప్రభుత్వంపట్టించుకోకపోగా, ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో సాయం చేసినట్టు కూడా వెల్లడించారు. మళ్లీ అదికారంలోకి రాగానే నిర్వాసితులకు 828 కోట్లు పరిహారం చెల్లించినట్టు చెప్పారు. 17,717 కుటుంబాల కోసం ఏర్పాటుచేస్తున్న 49 పునరావాస కాలనీలను 2025 నాటికి పూర్తిచేస్తాం అంటూ చంద్రబాబు ప్రకటించడం వారికి నిజంగా పెద్దవరమే.

పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి కావొచ్చు. అయితే ఆ ప్రాజెక్టు కోసం తమ ఆస్తులను ఇళ్లను ఊర్లను కూడా త్యాగం చేసిన వారిని మరచిపోవడం కరెక్టు కాదు. జగన్ పాలనలో వారిని ఏమాత్రం పట్టించుకోకపోగా.. చంద్రబాబు తాజాగా ప్రకటించిన హామీలు వారికి జీవితాలపై ఆశలు చిగురింపజేస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles