రాజకీయాల్లో ఉండడం వలన ఎడ్వాంటేజీలను అధికంగా అనుభవించేది పదవిలో ఉన్నవారే. ఓడలు బండ్లయినప్పుడు.. ప్రత్యర్థుల నుంచి దెబ్బ కాచుకోవాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు పడేది కూడా వారే. కానీ, తమ కుటుంబ సభ్యులను కూడా తమ అరాచక, అవినీతి దందాల్లో భాగంగా మార్చేసి.. భార్య కొడుకు సహా కుటుంబం మొత్తం పరారయ్యేంతటి పరిస్థితులను కల్పించిన ఘనత మాత్రం.. కేవలం మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్యకు మాత్రమే దక్కుతుంది. పేర్ని నాని గా అందరూ పిలుచుకునే ఈ వైసీపీ నాయకుడు ప్రస్తుతం పోలీసులకు దొరక్కుండా తిరిగే ప్రయత్నంలో ఉన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో ఆయన అనుచరులు ఏ స్థాయిలో దందాలను, అక్రమాలను కొనసాగించారో తెలుసుకోవడానికి పేర్నినాని వ్యాపారాలు కూడా ఒక ఉదాహరణ. జగన్ తొలిమంత్రివర్గంలో ఒకడిగా ఉన్న పేర్ని నాని.. మచిలీపట్నంలో తన భార్య పేరిట ఉన్న గోడౌన్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు. ఆ లీజు ఒప్పందం ప్రకారం.. కేవలం పౌరసరఫరాల శాఖ అక్కడ బియ్యం బస్తాలు నిల్వ చేసి ఆయనకు అద్దె చెల్లిస్తుంది అంతే. ఆ గోడౌన్ల నిర్వహణ మొత్తం బాధ్యత యజమానిగా పేర్ని నాని కుటుంబానిదే. ఆయన మనుషులు, మేనేజర్లే మొత్తం చూస్తారు. ఈ లీజుల ద్వారా నెలకు కొన్ని లక్షల రూపాయల ఆదాయం ఆయనకు సమకూరుతుంటుంది.
అయితే కేవలం లక్షల ఆదాయం కోసమే ఆయన గోడౌన్లు కట్టుకుని లీజుకు ఇచ్చారా? అనే సందేహం ప్రజలకు రావొచ్చు. కానీ.. పీడీఎస్ బియ్యం నిల్వ ఉండే గోడౌన్లే తమ చేతిలో ఉంటే.. రెండో కంటికి తెలియకుండా కూలీలకు కూడా అనుమానం రాకుండా ఆ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసేయడం సాధ్యమవుతుందని వారు యోచించినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. కాకినాడ బియ్యం స్మగ్లింగ్ బయటపడ్డాక పేర్నినాని గోడౌన్లలో 3700 బస్తాల, కోటికి విలువైన బియ్యం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. ఆయన భార్య మీద, గోడౌన్ల మేనేజరు మీద సివిల్, క్రిమినల్ కేసులు పెట్టారు. దీంతో పేర్ని నాని భార్య, కొడుకు కిట్టు సహా మాయమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కలెక్టర్లకు రైతుసమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడం, ధర్నాలు నిర్వహిస్తే.. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడా కనిపించలేదు. తాను చేసే దందాల కారణంగా.. తన కుటుంబం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టిన, పరారయ్యేలా చేసిన నేత పేర్ని నాని మాత్రమేనని అంతా చర్చించుకుంటున్నారు.
పేర్ని నాని రికార్డ్ : భార్యా కొడుకులతో సహా పరార్!
Wednesday, January 22, 2025