టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇపుడు తన సినిమాల కంటే ప్రభుత్వ కార్య కలాపాల్లో మాత్రమే బిజీగా ఉన్నారు. అయితే పవన్ వారసుడు అకీరానందన్ పుట్టినరోజు నేడు కాగా అభిమానులు అకిరాకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు కానీ ఇపుడు మరో షాకింగ్ వార్త పవన్ అభిమానులని ఆందోళనకి గురి చేసింది.
పవన్ చిన్న కొడుకు అయినటువంటి మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదానికి గురైన షాకింగ్ వార్త ఇపుడు అభిమానులని కలవరపెడుతుంది. అయితే మార్క్ శంకర్ సింగపూర్ లో తన విద్యాభ్యాసాలు కొనసాగిస్తుండగా అక్కడ తన పాఠశాలకు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇతర స్కూల్ పిల్లలతో పాటుగా తాను కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
దీనితో మార్క్ కి చేతులు, కాళ్ళకి గాయాలు అయ్యినట్టుగా నిర్ధారణ అయ్యింది. అంతే కాకుండా తన ఊపిరితిత్తుల్లోకి కూడా పొగ ప్రవేశించడంతో మార్క్ శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందికి లోనయ్యాడు అని ప్రకటన వచ్చింది. అయితే పవన్ ఇపుడు పొలిటికల్ పర్యటన ముగించిన తర్వాత వెంటనే సింగపూర్ వెళ్లనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం మార్క్ శంకర్ పవనోవిచ్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు.