పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయిన పవన్ కళ్యాణ్ విషయంలో గత కొన్ని రోజులుగా సినిమాలు సహా రాజకీయ పరంగా కూడా వార్తలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే పవన్ ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో రాజకీయ పరంగా మంచి హాట్ టాపిక్ అయ్యారు. అలాగే రీసెంట్ గా సనాతన ధర్మం కోసం మాట్లాడిన మాటలు, తీసుకున్న చర్యలు కూడా దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.
కానీ నిన్న తను చేపట్టిన మీటింగ్ తో మాత్రం పవన్ మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. కోలీవుడ్ నటుడు తమిళ ఉప ముఖ్యమంత్రి ఉదయనిది స్టాలిన్ పై కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.
పవన్ సనాతన ధర్మం విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఒక్క పాన్ ఇండియా స్పీచ్ తో అయితే పవన్ పాన్ ఇండియా సినిమాలు విడుదల చేయకుండానే పాన్ ఇండియా ప్రేక్షకులలో హాట్ టాపిక్ గా మారిపోయారు అని టాక్ నడుస్తుంది.