పవన్ సపోర్ట్ : సరస్వతీ భూములు తిరిగి రైతులకు!

Sunday, December 22, 2024

సరస్వతీ పవర్ పేరుతో పరిశ్రమలు ప్రారంభించి.. స్థానికులు అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఆ ప్రాంతం అన్నిరకాలుగా అభివృద్ధి చెందడానికి అది దారితీస్తుందని రకరకాల మాయమాటలు చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాచర్ల ప్రాంతంలోని రైతుల నుంచి దాదాపు 1500 ఎకరాలు కొనుక్కున్నారు. పరిశ్రమ రావడం అంటూ జరిగితే తమ ప్రాంతం బాగుపడుతుంది, తమ కుటుంబాలు బాగుపడుతాయి, తమ పిల్లలకు ఉద్యోగాలు దక్కుతాయి అనే రకరకాల ఆశలతో రైతులు కూడా కారుచవకగా భూములను అప్పట్లో జగన్ కు విక్రయించారు. కానీ దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటిదాకా ఎలాంటి కంపెనీ రాలేదు. నిర్మాణాత్మక పనులు అంటేనే అసహ్యించుకునే జగన్మోహన్ రెడ్డి  తన సొంత కంపెనీకోసం కూడా ఒక్క ఇటుక పెట్టి నిర్మాణం చేయనేలేదు. ఈ పరిస్థితుల్లో అన్నాచెల్లెళ్లు అదే సరస్వతీ పవర్ ఆస్తులకోసం కోర్టుకు ఎక్కి మరీ కొట్టుకోవడం షురూ అయింది. వాళ్లిద్దరి ఆస్తి తగాదా మాత్రమేకాదు కదా.. వారి మాటలకు వంచనకు గురైంది తాము కదా అనే చైతన్యం భూములు ఇచ్చిన రైతుల్లో వస్తోంది. తమకు మాట ఇచ్చినట్టుగా అసలు పరిశ్రమ ఇప్పటిదాకా పెట్టనేలేదు కాబట్టి.. తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలంటూ అక్కడి రైతులు ఆందోళనకు దిగుతున్నారు. సరస్వతీ పవర్ భూములను పరిశీలించిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా వారికి అండగా నిలుస్తున్నారు.

ప్రజల ఆస్తిని అడ్డగోలుగా మాయమాటలతో జగన్ దోచుకున్నారని, అలా దోచుకున్న ఆస్తికోసం ఇప్పుడు అన్నాచెల్లీ కొట్టుకుంటున్నారని పవన్ వ్యాఖ్యానించడం గమనించదగ్గది. తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలనే డిమాండ్లు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయని ఆయన అంటున్నారు. ఆ రైతులకు తాను అండగా నిలుస్తానని అంటున్నారు. ఇప్పటికే జగన్ కు భూములు అమ్మిన పలువురు రైతులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. తమకు అప్పట్లో కేవలం 3 లక్షల రూపాయలు ఇచ్చిచ తీసుకున్నారని.. చెప్పినట్టుగా పరిశ్రమలు పెట్టలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలని లేదా.. ఎకరాకు 18 లక్షల వంతున చెల్లించాలని వారు కోరుతున్నారు.

రైతుల భూములు మాత్రమే కాకుండా జగన్ కబ్జాలో ఉన్న భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు కూడా ఉన్నట్టు జగన్ లెక్కతీస్తున్నారు. వాటిని రద్దు చేయిస్తే రైతులకు తిరిగి భూములు ఇచ్చేయాల్సిన అనివార్యత సరస్వతీ పవర్ కు ఏర్పడుతుంది.

వైసీపీ దళాలు ఎంత దారుణంగా వ్యవహరించాయంటే.. ఎటూ పరిశ్రమ పెట్టలేదు గనుక.. ఈలోగా సాగుచేసుకుంటాం అని రైతులు అక్కడ పంటలు వస్తే.. మాచర్ల అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి అనుచరులు ట్రాక్టర్లతో దున్నించేసారు. అంత దుర్మార్గం చేశారు. ఇప్పుడు ఎటూ పరిశ్రమ వచ్చేలా కూడా లేదు గనుక.. తమ భూములు తమకు కావాలని రైతులు పట్టుదలగా పోరాడుతున్నారు.

ReplyForwardAdd reaction

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles