దారుణంగా జనసేన అని పవన్ కళ్యాణ్ పోలీసుల పట్ల చాలా గౌరవంతో ప్రేమతో వ్యవహరిస్తూ ఉంటారు వారికి ఉండే పని ఒత్తిడి పట్ల సానుభూతి కూడా చూపిస్తూ ఉంటారు అయితే ఇటీవల బహిరంగ వేదిక మీద నుంచి మాట్లాడుతూ ప్రస్తుతం పోలీసుల పనితీరు గురించి ఆయన ఏ స్థాయిలో రెచ్చిపోయారు గమనించారు హోం మంత్రి వంగలపూడి అనిత మీద పనితీరు మీద విమర్శలు చేసినట్లు అప్పట్లో భావించారు. కానీ పవన్ కల్యాణ్ ది ధర్మాగ్రహం అని.. ఆయన ఆ స్థాయిలో రెచ్చిపోవడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని అర్థమవుతోంది.
మంత్రిమండలి సమావేశంలోనే పవన్ కల్యాణ్ ఈ కారణాలను ఉద్వేగంగా వివరించినట్టు తెలుస్తోంది. తన కూతుళ్లు సోషల్ మీడియాలో వారి మీద జరుగుతున్న టోలింగ్ ను చూసి ఏడుస్తున్నారని, ఇంట్లోంచి బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారని ఒక తండ్రిగా పవన్ పేర్కొనడం గమనించాలి. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా తన మీద తన కుటుంబ సభ్యుల మీద వస్తున్న సోషల్ మీడియా పొస్టులకు సంబంధించి.. ప్రెప్ మీట్ లోనే ఎమోషనల్ కావడం అందరికీ గుర్తుంటుంది.
ఈ ఉదాహరణల్ని గమనించినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా దళాలు.. అత్యంత అసహ్యకరమైన రీతిలో నీచంగా వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ట్రోల్ చేయడంలో అత్యంత నీచంగా, అసభ్యకరమైన భాషలో, ఫోటోలను మార్ఫింగ్ చేసి మరీ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబునాయుడు కూడా తన కుటుంబం మీద, లోకేష్ కుటుంబం మీద వస్తున్న వాటిని గూడా ప్రస్తావించారు. బ్రాహ్మణి, భువనేశ్వరి గురించి పెడుతున్న పోప్టులను అనిత పేర్కొన్న సంగతి తెలిసిందే. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం గట్టిగానే ఆలోచిస్తున్నట్టు సమాచారం. సోషల్ మీడియా ముసుగులో నీచంగా వ్యవహరిస్తున్న వైసీపీ దళాలకు గట్టిగానే బుద్ధివచ్చేలా శిక్షలు పడేలా చూడబోతున్నారు. దొంగ ఐపీ అడ్రసులనుంచి పోస్టులు పెడుతూ.. చట్టానికి చిక్కకుండా జాగ్రత్తలు పడుతున్నారని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడాన్ని కూడా గమనించాలి.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం డిజిటల్ ప్రైవసీ చట్టాన్ని ప్రత్యేకంగా తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఐపీ అడ్రసులు దొంగవి పెట్టినా సరే.. ట్రాక్ చేయగల మార్గాన్ని సైబర్ క్రైం పోలీసులు అన్వేషిస్తే గనుక.. ఖచ్చితంగా ఈ దుర్మార్గపు పోస్టుల భరతం పట్టవచ్చునని పలువురు భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ది ధర్మాగ్రహం
Wednesday, January 22, 2025