పవన్ మీదికే నిందలు.. వినుత లక్ష్యం వైసీపీనే!

Friday, December 5, 2025

జనసేన పార్టీనుంచి బహిష్కరణకు గురైన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుత వ్యవహారం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. ఎటూ జనసేనలో బహిష్కరించేశారు గనుక.. తన రాజకీయ భవిష్యత్తు అంతమైపోయినట్టేనని వినుతకు అర్థమైంది. చాలా స్పష్టంగా తన పీఏ రాయుడును హత్యచేసి చెన్నై కాలువలో పారేసిన కేసును చెన్నైపోలీసుల వద్ద ఒప్పేసుకున్న వినుత దంపతులు ఇప్పుడు పెద్ద ఎత్తుగడే వేశారు. ఏకంగా పవన్ కల్యాణ్ మీదనే నిందలు వేస్తున్నారు. మొన్నటిదాకా తన రాంబాబును ప్రేరేపించడం వెనుక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీద నిందలు వేసిన వినుత, పవన్ కల్యాణ్ కూడా తమను పట్టించుకోలేదని అంటున్నారు. పవన్ కల్యాణ్ మీద నిందలు పడగానే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లడ్డూ లాంటి అవకాశం దొరికినట్టుగా అయింది. పూర్తిగా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయడానికి వైసీపీ వందిమాగధులందరూ రంగంలోకి దిగుతున్నారు.

జనసేన ఇన్చార్జి వినుత , ఆమె భర్త చంద్రబాబు కలిసి తమ పీఏ రాయుడును హత్యచేసిన మాట నిజం. బుకాయించి తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశమూ లేకుండా.. పక్కా ఆధారాలతో సహా వారు తమిళనాడు పోలీసులకు దొరికిపోయారు. తమిళనాడు పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లిన తర్వాత.. విచారణలో హత్య చేసిన సంగతిని కూడా ఒప్పుకున్నారు. కాకపోతే ఇప్పుడు.. ఈ పాపాన్ని ఇతరుల మీదికి నెట్టేస్తే తమ మీద జనంలో సానుభూతి వస్తుందేమో అని భ్రమిస్తున్నట్టుగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే వారిని పురిగొల్పి, బొజ్జల సుధీర్ రెడ్డి మీద, పవన్ కల్యాణ్ మీద నిందలు వేయించి.. ఆ తర్వాత.. వాటిని బహుళ ప్రచారంలోకి తీసుకెళ్లే బాధ్యత తామే తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

తమ దంపతులు బెడ్రూంలో ఉండగా రాంబాబు ప్రెవేటు వీడియోలు తీశాడని, అందుకే కొట్టి చంపేశామని వినుత దంపతులు పోలీసులతో ఒప్పుకున్నారు. కాకపోతే.. ఎమ్మెల్యే సుధీర్ ను ఈ వ్యవహారంలోకి లాగి.. సుధీర్ తన పీఏను ఆ పనికి పురిగొల్పినట్టుగా, తీసిన వీడియోలను 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్టుగా చెబుతున్నారు. ఆ విషయం మొత్తం తాము జనసేనాని పవన్ కల్యాణ్ కు చెప్పాం అని.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయవద్దు.. సుధీర్ తో తాను మాట్లాడతానని అన్నట్టుగా బయటకు వస్తోంది.
అయితే తాము హత్య చేసి పక్కాగా దొరికిపోయిన తర్వాత.. ఇక ఏ రకంగానూ తప్పించుకునే మార్గమే కనిపించకపోతుండగా.. రకరకాల డొంకతిరుగుడు మాటలతో వినుత దంపతులు తమ గొయ్య తామే తవ్వుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. నేరానికి సంబంధించి చట్టం విధించే శిక్ష ఎటూ తప్పదు.. కానీ.. ప్రజల్లో పవన్ కల్యాణ్ ను, సుధీర్ ను నిందించి, తమ మీద సానుభూతి వచ్చేలా చేసుకోగలిగితే.. వైసీపీ ద్వారా ఎంతో కొంత అండ ఉంటుందని వారు ఆరాటపడుతుంటున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. కానీ వారి ఎత్తుగడలు ఫలించే అవకాశం లేదని ప్రజలంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles