పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఓజి గురించి కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత పవన్ ఇంత పెద్ద స్థాయిలో తెరపై కనిపించబోతుండటంతో ఈ సినిమా చుట్టూ అంచనాలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇప్పటికే ప్రీమియర్స్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తూ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.
తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానుందని మేకర్స్ ముందే ప్రకటించారు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ లిస్ట్‌లోకి కన్నడ వెర్షన్ కూడా చేరవచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి డబ్బింగ్ పనులు జరుగుతున్నట్టు ఫిల్మ్ నగర్ లో ప్రచారం నడుస్తోంది. కానీ ఈ వార్త ఎంతవరకు నిజమో అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
