టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. పవన్ కొత్త స్టైల్లో కనిపించబోతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమా విడుదలైన రోజు వచ్చే కలెక్షన్లు చూసి మాత్రమే ఈ హైప్ ఎంత స్థాయిలో ఉందో అర్థం కానుంది.
ఇక వ్యాపార పరంగా కూడా ఓజి ఇప్పటికే పెద్ద చర్చకు కారణమైంది. దేశవ్యాప్తంగా మంచి రేట్లకు అమ్ముడైపోతున్న ఈ సినిమాలో, నైజాం రీజియన్ హక్కుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నిర్మాత దిల్ రాజు ఈ ప్రాంత హక్కులను భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అంటే నైజాం మార్కెట్ లో ఆయన ఆధ్వర్యంలోనే ఈ భారీ సినిమా విడుదల కాబోతోందని స్పష్టమవుతోంది.
