ఒక్క అడుగు అంచనాలు అందనంత!

Saturday, December 28, 2024

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ ఫినామినా మూవీ  “రౌద్రం రణం రుధిరం” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రపంచాన్నే భారతదేశం వైపు తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన విషయం తెలిసిందే.

మరి ఈ సినిమాతోనే దర్శకుడు రాజమౌళి కూడా గ్లోబల్ డైరెక్టర్‌గా మారిపోగా తన నుంచి అవైటెడ్ డ్రీం ప్రాజెక్ట్ “మహాభారతం” ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా మందే ఎదురు చూస్తున్నారు. అయితే తన పీరియాడిక్ సినిమాల్లో చాలా వరకు మహాభారతం, ఇతిహాసాల పాత్రలు ప్రేరణగానే కొన్ని పాత్రలు చేస్తానని జక్కన్న ఇంతకు ముందేచెప్పిన విషయం తెలిసిందే.

మరి ఇలానే RRR లో కూడా చేసినట్టుగా లేటెస్ట్ డాక్యు మూవీలో కూడా విడుదల చేశారు. అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ డాక్యు చిత్రంలో జక్కన్న స్టేట్మెంట్ ఇపుడు ఆసక్తి రేపింది. తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం చేసేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ అనేది ఒక్క అడుగు దూరంలోకి తీసుకొచ్చింది అని తాను తెలిపారు. దీంతో ఈ సినిమా తనకి ఎంత స్పెషల్ అనేది అర్ధం చేసుకోవచ్చు. మరి చూడాలి తన డ్రీం ప్రాజెక్ట్ ని ఎప్పుడు మొదలు పెడతారు అనేది.  

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles