మరోసారి ఇండియన్‌ స్క్రీన్‌ పై రామాయణం..ఈ సారి రాముడంటే!

Tuesday, January 21, 2025

భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో సాగే కథలను తెరకెక్కించేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వచ్చిన ఆదిపురుష్‌, బ్రహ్మాస్త్ర, రీసెంట్‌ సెన్సేషనల్‌ రెబల్‌ స్టార్‌ కల్కి సినిమా కూడా భారతీయ పురాణాల ఆధారంగా రూపుదిద్దుకున్నవే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రామాయణాన్ని ఇండియన్‌ తెర పై చూపించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 రణ్‌బీర్‌కపూర్‌ హీరోగా  బాలీవుడ్ లో  ‘రామాయణ’ అనే చిత్రం రానుంది. గతంలో వచ్చిన బ్రహ్మాస్త్ర తో భారీ హిట్ కొట్టిన రణ్‌బీర్‌ ఈ సారి రాముని పాత్రలో కనిపించబోతున్నాడు. టాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అద్భుతమైన నటనను కనబరిచి, టాలీవుడ్‌ లేడీ పవర్‌ స్టార్‌ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ‘రామాయణ’ చిత్రంలో సీతగా కనిపించనుంది.

పదితలల రావణాసురుడిగా కన్నడ స్టార్ హీరో యష్ నటించనున్నట్టు టాక్‌. దంగల్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్‌ తివారీ ‘రామాయణ’కు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం కోసం మూవీ మేకర్స్‌ ఏకంగా 12 సెట్లు నిర్మించబోతున్నారంట. రామాయణంలోని అత్యంత కీలకమైన అయోధ్య, మిథిలా పట్టణాలను కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఖర్చుకు వెనుకడకుండ వాటిని రూపొందిస్తున్నారు. ముంబయిలో 3-D ఫార్మేట్ లో భారీ సెట్స్ నిర్మించనున్నారు.

‘రామాయణ’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నాడు దర్శకుడు నితేశ్ తివారి. షూటింగ్ చక చక ముగించి VFX పనులను కంప్లిట్ చేసి మొదటి భాగాన్ని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం రెడీ అవుతుంది. ఇండియన్ హిస్టరీలో భారీ బడ్జెట్ లో రానున్న ఈ సినిమాని  రాకింగ్ స్టార్ యశ్‌ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles