మరోసారి మెగా వర్సెస్‌ అల్లు!

Tuesday, January 21, 2025

డిసెంబరులో విడుదలయ్యే సినిమాలలో ప్రస్తుతానికి రెండు సినిమాల గురించి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ముందుగా డిసెంబరులో వస్తున్నామని పుష్ప 2 చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల కాంబోలో వచ్చిన పుష్ప సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా రాబోతున్న పుష్ప-2 ఫై భారీ అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.

దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ, షూటింగ్స్ క్యాన్సిల్ అవుతూ ఆలా నడుస్తూ ఉంది. ఈ నెలలో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ చేయాల్సి ఉండగా అనుకోని కారణాల వలన సినిమా వాయిదా పడింది.మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేస్తున్నామని అధికారికంగా నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల  డిసెంబరు 6న వస్తున్నట్టు మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే .

మరోవైపు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ పరిస్థితి కూడా సుమారు ఇదే. మూడేళ్ళుగా షూటింగ్ జరుపుతూనే ఉన్నారు. భారతీయుడు-2 కారణంగా చరణ్ సినిమాను పక్కన పెట్టేశాడు శంకర్. ఇప్పుడు భారతీయుడు-2 విడుదల అవడంతో గేమ్ ఛేంజర్ ను తిరిగి ప్రారంభించే పనిలో పడ్డాడు. త్వరగా షూటింగ్ ముగించాలని చిత్ర బృందం కూడా భావిస్తోంది. కాగా ఈ సినిమాని డిసెంబరు 25న విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

దీంతో 19 రోజుల గ్యాప్ లో అల్లు, మెగా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. కానీ ఇలా ఒకే నెలలో తక్కువ గ్యాప్ లో సినిమాలు విడదుల కారణంగా పుష్ప -2 థియేటర్లను, గేమ్ ఛేంజర్ కు కేటాయించాల్సి వస్తుంది. అప్పుడు సినిమా లాంగ్ రన్ పై ప్రభావం పడే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఈ డిసెంబరు క్లాష్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles