మేనమామ కోసం కాలినడకన తిరుపతికి!

Andhrawatch
1 Min Read

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగులేని విజయాన్నిఅందుకుంది.ఎన్డీయే లో భాగం అయిన జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లకు గాను 21 విజయం సాధించింది. అలాగే పోటీ చేసిన రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకొని 100 శాతం అద్భుత విజయాన్ని అందుకుంది.

అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ప్రస్తుత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ అంతా కూడా ఎంతో అండగా నిలిచింది. మెగా హీరోలు వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ ,వైష్ణవ తేజ్ పిఠాపురంలో ప్రచారం కూడా నిర్వహించారు.

అలాగే ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు కూడా పవన్ కల్యాణ్ కి తమ మద్దతు ప్రకటించారు. వీరందరి మద్దతుతో పవన్ అద్భుత విజయం సాధించాడు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ గెలిస్తే కాలినడకన తిరుమల వస్తానని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొక్కుకున్నాడు. తాజాగా ఆ మొక్కును తీర్చుకోవడం కోసం కాలినడకన తిరుమలకు వెళ్లారు.ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Share This Article