ఓజీ మొదటి టికెట్‌ 5 లక్షలు..కొన్నది ఎవరో తెలుసా!

Tuesday, December 9, 2025

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమాన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేనే లేదు. ఇప్పుడు ఆయన 54వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వేడుకల నడుమ పవన్ నటిస్తున్న “ఓజి” సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకొచ్చింది.

సమాచారం ప్రకారం, ఈ సినిమా నైజాం ప్రాంతానికి సంబంధించిన తొలి టికెట్ అసలు ఊహించని రేంజ్ లో అమ్ముడైందట. ఆ టికెట్ ధర ఏకంగా ఐదు లక్షల రూపాయలు. ఈ భారీ మొత్తం చెల్లించింది పవన్ కళ్యాణ్ అభిమానుల నార్త్ అమెరికా టీమ్ అని టాక్ వినిపిస్తోంది.

ఈ రికార్డు స్థాయి ధరతో కొనుగోలు చేసిన టికెట్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతేకాకుండా, ఆ టికెట్ కోసం ఖర్చు చేసిన డబ్బును పవన్ రాజకీయ పార్టీకి విరాళంగా ఇస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles